‘బుజ్జిగాడు’ ఫేం సంజనా గల్రాని (Sanjana galrani) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఇటీవల గ్రాండ్‌గా సీమంతం జరుపుకొన్న ఆమె మగబిడ్డకు జన్మనిచ్చి తల్లయ్యారు. ఈ విషయాన్ని ఆమెకు వైద్యం అందించిన డాక్టర్ రీతూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆ పోస్ట్‌లను సంజనా ఇన్‌స్టా స్టాటస్‌లో పెట్టారు. ‘సోగ్గాడు’(Soggadu) చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన సంజనా ‘బుజ్జిగాడు’(bujjigadu fame) సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘ముగ్గురు’, ‘యమహో యమః’, ‘లవ్ యూ బంగారం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’(Sardar gabbar singh) వంటి చిత్రాల్లో నటించారు. 2020 లాక్డౌన్ సమయంలో బెంగళూరుకు చెందిన అజీజ్ పాషా అనే వైద్యుడిని వివాహం చేసుకున్నారు సంజనా.
మరోవైపు సంజనా సోదరి నిక్కీ గల్రానీ హీరో ఆది పినిశెట్టిని ఈ బుధవారం పెళ్లి చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. నెల రోజుల క్రితం నిశ్చితార్థం చేసుకుని మూడుముళ్ల బంధం ఆది–నిక్కీ ఒకటయ్యారు.