శానిటైజర్లతో పిల్లల్లో నేత్ర సమస్యలు!

ABN , First Publish Date - 2021-01-25T07:41:32+05:30 IST

మీ పిల్లలు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు వాడుతున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త !! వాటిని వాడే పిల్లల్లో కళ్లకు సంబంధించిన

శానిటైజర్లతో పిల్లల్లో నేత్ర సమస్యలు!

శానిటైజ్‌ చేసిన చేతులతో కళ్లను తాకడం వల్లే ముప్పు 


న్యూఢిల్లీ, జనవరి 24 : మీ పిల్లలు చేతులను శుభ్రం చేసుకునేందుకు శానిటైజర్లు వాడుతున్నారా? అయితే తస్మాత్‌ జాగ్రత్త !! వాటిని వాడే పిల్లల్లో కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తున్నాయని ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ పాయిజన్‌ కంట్రోల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. శానిటైజర్‌ను వాడిన తర్వాత.. పిల్లలు అవే చేతులతో కళ్లను తాకినప్పుడు ప్రమాదకర రసాయనాలు కళ్లలోకి చేరి సమస్యలు మొదలవుతున్నాయన్నారు. ఫలితంగా కొందరు పిల్లల ఆరోగ్యం విషమిస్తున్నట్లు చెప్పారు. ఈ తరహా నేత్ర సమస్యలతో వైద్యులను సంప్రదిస్తున్న పిల్లల సంఖ్య అంతక్రితం ఏడాదితో పోలిస్తే.. 2020 సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 24 మధ్యకాలంలో ఏకంగా ఏడు రెట్లు పెరిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. 2019 సంవత్సరంలో పిల్లల కంటి సమస్యల్లో 1.3 శాతం కేసులే హ్యాండ్‌ శానిటైజర్‌తో ముడిపడినవి కాగా, 2020 సంవత్సరంలో అవి ఒక్కసారిగా 9.9 శాతానికి పెరిగాయన్నారు.


మోడెర్నాతో అలర్జీలు అరుదు: సీడీసీ

పలు దేశాల్లో వినియోగిస్తున్న మోడెర్నా కరోనా వ్యాక్సిన్‌తో అలర్జీలు అత్యంత అరుదని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) పేర్కొంది. ఇక కరోనా వ్యాక్సినా తీసుకొన్నా.. తీసుకోకపోయినా జాగ్రత్తలు, నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని ఇంగ్లండ్‌లోని ప్రముఖ వైద్యుల్లో ఒకరు, డిప్యూటీ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ జొనాథన్‌ వేన్‌టామ్‌ పేర్కొన్నారు. వైరస్‌ వ్యాప్తిపై వ్యాక్సిన్‌ ఎంత వరకూ ప్రభావం చూపుతోందనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదని ఆయన వెల్లడించారు. 

Updated Date - 2021-01-25T07:41:32+05:30 IST