ఆర్టీసీలో శానిటైజర్లపై రచ్చ

ABN , First Publish Date - 2020-06-04T10:00:01+05:30 IST

ఏపీఎస్‌ ఆర్టీసీ అనంతపురం బస్టాండు పరిధిలో ప్రయాణికులకు ఇస్తున్న శానిటైజర్లపై రచ్చ కొనసాగుతోంది. శానిటైజర్ల ..

ఆర్టీసీలో శానిటైజర్లపై రచ్చ

బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రావణం ఇవ్వడంపై ప్రయాణికుల ఆగ్రహం


అనంతపురం టౌన్‌, జూన్‌ 3 : ఏపీఎస్‌ ఆర్టీసీ అనంతపురం బస్టాండు పరిధిలో ప్రయాణికులకు ఇస్తున్న శానిటైజర్లపై రచ్చ కొనసాగుతోంది. శానిటైజర్ల స్థానంలో బ్లీచింగ్‌ పౌడర్‌ ఇస్తుండడంతో ఆర్టీసీ సిబ్బందిపై ప్ర యాణికులు మండిపడుతున్నారు. గతంలో నూ ‘ఆంధ్రజ్యోతి’ ఇదే అంశాన్ని ప్రచురించిం ది. అయినా సిబ్బందిలో మార్పు లేదు. బుధవారం కూడా ఇదే ఘటన పునరావృతమైంది. ఓవైపు రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో 20 లీటర్ల శానిటైజర్‌ ద్రావణాన్ని వితరణ చేశారు. మరో వైపేమో ఆర్టీసీ కండక్టర్లు ప్రయాణికులకు బ్లీచింగ్‌ పౌడర్‌ ద్రావణాన్నే వేస్తూ సా గారు.


దీంతో సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయసాగారు. ఇలాంటి ఘ టనలు గత వారం రోజుల నుంచి ప్రతిరోజూ జరుగుతున్నాయి. బస్సు ఎక్కే ప్రతి ప్రయాణికుడూ శానిటైజర్‌తో చేతులు శుభ్రపరుచుకునేందుకు ప్రతి కండక్టరుకు రోజుకు 500 ఎంఎల్‌ శానిటైజర్‌ను అందించాలని ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. అయితే జిల్లాలో మాత్రం ఆ ఆదేశాలు బేఖాతరు చేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఉన్నతాధికారులు తమ కు అందించిన ద్రావణాన్నే ప్రయాణికులు చే తులు శుభ్రపరుచుకునేందుకు అందిస్తున్నట్లు కండక్టర్లు చెబుతుండటం గమనార్హం. 

Updated Date - 2020-06-04T10:00:01+05:30 IST