కరోనా కట్టడికి పారిశుధ్య చర్యలు

ABN , First Publish Date - 2020-04-02T10:47:08+05:30 IST

కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో

కరోనా కట్టడికి పారిశుధ్య చర్యలు

తిప్పర్తి / మర్రిగూడ / మునుగోడు / నార్కట్‌పల్లి / నకిరేకల్‌ /రామన్నపేట/చౌటుప్పల్‌ టౌన్‌ / సూర్యాపేట రూరల్‌, ఏప్రిల్‌ 1 : కరోనా వైరస్‌ నివారణలో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. తిప్పర్తి మండల కేంద్రంలో జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, సర్పంచ్‌ రొట్టెల రమేష్‌ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై పిచికారీ చేయించారు. ఇండ్లూరులో ఎంపీపీ విజయలక్ష్మి బియ్యం పంపిణీ చేశారు.


కార్యక్రమంలో సర్పంచ్‌ మార్త శ్రీదేవిసైదులు పాల్గొన్నారు. మర్రిగూడ మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య చర్యలు చేపడుతూ బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఆయా కార్యక్రమాల్లో తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, సర్పంచులు నల్లా యాదయ్యగౌడ్‌, మాడెం శాంతమ్మ, చిట్యాల సబిత యాదగిరిరెడ్డి, జంగయ్య, మాధవి, వెంకటమ్మ, యాకూబ్‌ పాల్గొన్నారు. మునుగోడు మండలంలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని సర్పంచ్‌లకు జడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవిముదిరాజ్‌, ఎంపీపీ కర్నాటి స్వామియాదవ్‌ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సునీత పాల్గొన్నారు. నార్కట్‌పల్లి, నకిరేకల్‌ మండలాల్లోనూ రసాయన మందులను అధికారులు, ప్రజా ప్రతినిధులు వీధుల్లో పిచికారీ చేయించారు. 


రామన్నపేట మండల కేంద్రంలో సర్పంచ్‌  గోదాసు శిరీషపృథ్వీరాజ్‌ ఫాగింగ్‌ చేయించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఫైర్‌ సిబ్బంది, పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పారిశుధ్య సిబ్బంది పిచికారీ చేయించారు. సూర్యాపేట మండలంలోని బాలెంలలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పటేల్‌ రమే్‌షరెడ్డి హైడ్రోకోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. 

Updated Date - 2020-04-02T10:47:08+05:30 IST