పారిశుధ్యం.. అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2022-01-18T05:04:34+05:30 IST

పారిశుధ్యం.. అస్తవ్యస్తం

పారిశుధ్యం.. అస్తవ్యస్తం
బషీరాబాద్‌ : గిరిజన తండాలో రోడ్డుపైకి చేరిన మురుగు నీరు

నవాబుపేట/బషీరాబాద్‌ : నవాబుపేట మండల పరిధి గుబ్బడి పత్తేపూర్‌ గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. కొన్ని రోజులుగా గ్రామంలో పంచాయతీ పాలకవర్గం పారిశుధ్య పనులు చేపట్టకపోవడంతో మురికి కాలువల్లోకి చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ కవర్లు, బాటిళ్లు, మురుగు చేరడంతో నీరంతా రోడ్ల మీదికి ప్రవహిస్తోంది. దుర్గంధం వెదజల్లడంతో ఇళ్లలో ఉండలేకపోతున్నామని, రాత్రిపూట దోమల బెడద తీవ్రంగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ప్రజాప్రతినిఽధులకు, అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, సర్పంచ్‌, అధికారులు స్పందించి వెంటనే పారిశుధ్య పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.  అదేవిధంగా బషీరాబాద్‌ మండలం మైల్వార్‌, కంసాన్‌పల్లి(బి), కొత్లాపూర్‌ తదితర గ్రామాలతో పాటు గిరిజన తండాలలో పారిశుధ్యం పడకేసింది. ఇళ్ల నుంచి వచ్చే వృథా నీరంతా రోడ్లపైకి చేరడంతో స్థానిక ప్రజలు కాలినడకన వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు దోమల బెడద ఎక్కువైందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొత్తగా మురుగు కాల్వలను నిర్మించి సమస్యను శాశ్వతంగా పరిష్కారించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - 2022-01-18T05:04:34+05:30 IST