కూలీల కోసం విరాళాలు సేకరిస్తా!

ABN , First Publish Date - 2020-03-26T08:29:51+05:30 IST

రోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన రోజుకూలీలను ఆదుకోవడం కోసం విరాళాలు సేకరించడానికి టెన్నిస్‌ స్టార్‌...

కూలీల కోసం విరాళాలు సేకరిస్తా!

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయిన రోజుకూలీలను ఆదుకోవడం కోసం విరాళాలు సేకరించడానికి టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా ముందుకొచ్చింది. ఈ కష్టకాలంలో వారికి సహాయం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ‘సఫా’ స్వచ్ఛంద సంస్థ, మరికొంత మందితో కలిసి కూలీలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు  తెలిపింది. సంపన్నులు, ఉద్యోగులు వారి సమీపంలోని పేద కుటుంబాలకు సహాయం చేయాలని సానియా కోరింది.


Updated Date - 2020-03-26T08:29:51+05:30 IST