Abn logo
Jul 6 2020 @ 06:22AM

అక్ష‌య్ పేరు చెప్పి భ‌ర్త‌కు షాకిచ్చిన సానియా!

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెట‌ర్ షోయ‌బ్ దంప‌తుల‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో లెక్క‌లేనంత‌మంది అభిమానులున్నారు. దీంతో  ఈ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇస్తుంటారు. ఈ నేప‌ధ్యంలో సానియా మీర్జా త‌న త‌న స‌మాధానంతో భ‌ర్త‌ను షాక్‌లో ప‌డేశారు. షోయ‌బ్ మాలిక్ త‌న భార్య సానియా ఫేవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసుకోవాల‌నుకున్నారు. దీంతో ఆయ‌న సానియాను ఈ ప్ర‌శ్న అడిగారు. దీనికి స‌మాధానంగా ఆమె త‌న అభిమాన క్రికెట‌ర్ బాబ‌ర్ ఆజమ్ అని చెప్పారు. దాని త‌రువాత షోయ‌బ్ త‌న భార్య‌ సానియాతో ఒక‌వేళ అవ‌కాశం వ‌స్తే న‌టులు టామ్ క్రూజ్‌, అక్ష‌య్ కుమార్‌ల‌లో ఎవ‌రిని వివాహం చేసుకుంటావు? అని అడిగారు. దీనికి స‌మాధానంగా ఆమె వెంట‌నే అక్ష‌య్ కుమార్ పేరు చెప్పారు. అక్ష‌య్‌ను అత‌ని చిత్రం మెహ్రా చూసిన‌ప్ప‌టి నుంచి ఇష్ట‌ప‌డుతున్నాన‌ని తెలిపారు. అయితే సానియా  చెప్పిన ఈ రెండు స‌మాధానాలు షోయ‌బ్‌కు మింగుడుప‌డ్డాయో లేదో మ‌రి! 

Advertisement
Advertisement
Advertisement