రేపు వన్‌ వరల్డ్‌ ఫ్యూజన్‌ సంగీత విభావరి

ABN , First Publish Date - 2022-08-13T06:17:43+05:30 IST

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సంగితాంజలి ఫౌండేషన్‌, తెలంగాణ

రేపు వన్‌ వరల్డ్‌ ఫ్యూజన్‌ సంగీత విభావరి

పంజాగుట్ట, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సంగితాంజలి ఫౌండేషన్‌, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగం సహకారంతో వన్‌ వరల్డ్‌ ఫ్యూజన్‌ సీజన్‌ 9 పేరుతో ప్రత్యేక సంగీత విభావరిని నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్‌ చైర్మన్‌ అభిజిత్‌ బట్టాచార్య తెలిపారు. శుక్రవారం ఎర్రమంజిల్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో హోటల్‌ జనరల్‌ మేనేజర్‌ సౌమిత్ర పహారి, ఆటిజం ఆశ్రమం నిర్వాహకులు డాక్టర్‌ ఏకేకుంద్రా, కాజల్‌లతో కలిసి అభిజిత్‌ బట్టాచార్య సంగీత విభావరికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించి, వివరాలు వెల్లడించారు. ఆటిజం వ్యాధులతో బాధపడే చిన్నారుల కోసం పని చేేస ఆటిజం ఆశ్రమం వారి సహాయార్థం ఈ నెల 14న  సాయంత్రం మాదాపూర్‌ లోని శిల్పకళా వేదికలో సంగీత విభావరిని నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రముఖ బాలీవుడ్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌ జస్పిందర్‌ నరూలాతోపాటు శాక్సా ఫోన్‌ పై అమెరికాకు చెందిన మార్క్‌ ఎడ్వర్డ్‌, బాస్‌ గీటార్‌ పై ప్రముఖ రాక్‌ సింగర్‌ మోహిని, కీ బోర్డు పై స్టీఫెన్‌ డెవస్సీ, గీటార్‌పై ప్రముఖ బాలీవుడ్‌ కళాకారులు సుజయ్‌ డే, తబలా పై నవాజ్‌ ఉస్తాద్‌ షాదాబ్‌ షకూరి, డ్రమ్స్‌ పై మంజునాథ్‌, వయోలిన్‌ పై రవి పవార్‌ తదితరులు ప్రదర్శన ఇవ్వనున్నారు.


Updated Date - 2022-08-13T06:17:43+05:30 IST