Advertisement
Advertisement
Abn logo
Advertisement

వ్యాక్సిన్‍ వద్దంటూ చెట్టెక్కిన యువకుడు..

సంగారెడ్డి జిల్లా: కరోనా వ్యాక్సిన్ వద్దంటూ ఓ యువకుడు చెట్టెక్కాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్  మండలం, రేజింతల్‌లో జరిగింది. ఇంటింటికి కరోనా టీకాలో భాగంగా సర్దార్ అనే వ్యక్తి ఇంటికి వైద్య  సిబ్బంది వెళ్లారు. ఇది గమనించిన సర్దార్ పెద్ద కుమారుడు గౌసుద్దీన్ కరోనా టీకా వద్దంటూ ఇంటి ఆవరణలో ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. కుటుంబసభ్యులు, వైద్య సిబ్బంది ఎంత బతిమాలినా గౌసుద్దీన్ వినకపోవడంతో చేసేదేమి లేక టీకా వేయకుండానే వెనుదిరిగారు. అయితే తన కుమారుడికి కొన్నాళ్లుగా మానసిక స్థితి సరిగా లేదని సర్దార్ చెబుతున్నారు.

Advertisement
Advertisement