Advertisement
Advertisement
Abn logo
Advertisement

సంగారెడ్డి జిల్లా: వ్యభిచార ముఠా అరెస్టు

సంగారెడ్డి జిల్లా: అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు కాలనీల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. నిర్వాహకులతోపాటు మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేశారు. నరేంద్ర కాలనీలోని ఓ అపార్టుమెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. నిర్వాహకులతో పాటు విటులు, కోల్‌కత్తాకు చెందిన యువతులను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబం పేరుతో ఇల్లు అద్దెకు తీసుకుని గుట్టుచప్పడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వాసనీయ సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.

Advertisement
Advertisement