Abn logo
Sep 11 2021 @ 07:52AM

నేడు జోగిపేటలో పదాధికారులతో Bandi sanjay భేటీ

సంగారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్ అధ్యక్షతన పదాధికారుల సమావేశం ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు జోగిపేటలో జరుగనుంది. పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రాజా సింగ్,  రఘునందన్ రావు, డికే అరుణ, ఎంపీ అర్వింద్, మాజీ మంత్రి ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షులు, ముఖ్య నాయకులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఈ నెల 17న నిర్మల్‌లో తలపెట్టిన అమిత్ షా బహిరంగ సభ, హుజురాబాద్ ఉప ఎన్నిక, పాదయాత్ర, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై  నేతలు చర్చించనున్నారు.