కొత్తపల్లి, జనవరి 28: జలాధివాసం నుంచి సంగమేశ్వరాలయం బయల్పడింది. కృష్ణా నదీ జలాలను పది రోజులుగా సాగు, తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలం రిజర్వాయర్ నీటిమట్టం 839.80 అడుగులకు చేరుకోగా నీటి నిల్వలు 61.55 టీఎంసీలు నమోదయ్యాయి. నీటి మట్టం తగ్గడంతో ఆలయం పూర్తిగా బయటపడింది. సోమవారం సంగమేశ్వరునికి తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనం కల్పించనున్నారు. సంగమేశ్వరాలయం జలాధివాసం అయ్యే వరకు నిత్య పూజాది క్రతువులు కొనసాగిస్తామని తెలకపల్లి రఘురామశర్మ తెలిపారు.