కొత్తపల్లి, జనవరి 26: శ్రీశైలం బ్యాక్ వాటర్ తగ్గుముఖం పట్టడంతో సప్త నదుల సంగమేశ్వరాలయం బయల్పతోంది. బుధ వారం సాయంత్రానికి శ్రీశైలం జలాశయ నీటి మట్టం 842 అడు గులకు చేరుకోవడంతో మరో మూడు రోజుల్లో సంగమేశ్వరాలయం పూర్తి స్థాయిలో బయల్పడి సంగమేశ్వరుని దర్శన భాగ్యం భక్తులకు కలగనుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 2,3 అడుగుల నీటి మట్టం తగ్గి తే ఆలయం పూర్తి స్థాయిలో బయల్పడనుంది. బుధవారం కొంత మంది భక్తులు నదిలో పుట్టిలో వెళ్లి ప్రాచీన సంగమేశ్వరంలోని ప్రాంగణంలో ప్రత్యేక పూజలు చేశారు.