ఆర్చర్ లేకపోవడం పెద్ద దెబ్బ: సంగక్కర

ABN , First Publish Date - 2021-04-12T16:06:56+05:30 IST

ప్రధాన బౌలర్‌ జొఫ్రా ఆర్చర్‌ లేకపోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పూడ్చలేని లోటని ఆ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర అన్నాడు.

ఆర్చర్ లేకపోవడం పెద్ద దెబ్బ: సంగక్కర

ప్రధాన బౌలర్‌ జొఫ్రా ఆర్చర్‌ లేకపోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టుకు పూడ్చలేని లోటని ఆ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర అన్నాడు. టీమిండియాతో ఇటీవల జరిగిన సిరీస్‌లో ఆర్చర్ చేతికి గాయమైంది. సుదీర్ఘ విశ్రాంతి అవసరం కావడంతో ఆర్చర్ ఐపీఎల్ ఎంట్రీపై స్పష్టత కొరవడింది. టీమ్‌కు ప్రధాన బౌలర్ అయిన ఆర్చర్ దూరమవడం ఇబ్బందికరమేనని సంగక్కర అంగీకరించాడు. 


`సంజూ శాంసన్‌(కెప్టెన్‌), నేను ఒక్క విషయాన్ని అంగీకరించాల్సిందే. ఆర్చర్‌ మా టీమ్‌కు పెద్ద బలం. ఈసారి అతను అందుబాటులో లేకపోవడం మాకు గట్టి దెబ్బేన`ని సంగక్కర పేర్కొన్నాడు. ఆర్చర్ లేని లోటును క్రిస్ మోరిస్ తీరుస్తాడని రాజస్థాన్ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ఏడాది జరిగిన వేలంలో మోరిస్‌ కోసం రాజస్థాన్ టీమ్ ఏకంగా రూ.16 కోట్లు వెచ్చించింది. 

Updated Date - 2021-04-12T16:06:56+05:30 IST