శాండ్‌విచ్‌

ABN , First Publish Date - 2022-03-12T18:31:37+05:30 IST

బ్రెడ్‌ స్లైస్‌లు - నాలుగైదు, హంగ్‌ కర్డ్‌ - అరకప్పు, క్యారెట్‌ తురుము - అరకప్పు, కీరదోస తురుము - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, ఉల్లికాడలు - నాలుగైదు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, చాట్‌మసాల - ఒక టీస్పూన్‌.

శాండ్‌విచ్‌

కావలసినవి: బ్రెడ్‌ స్లైస్‌లు - నాలుగైదు, హంగ్‌ కర్డ్‌ - అరకప్పు, క్యారెట్‌ తురుము - అరకప్పు, కీరదోస తురుము - అరకప్పు, ఉల్లిపాయ - ఒకటి, ఉల్లికాడలు - నాలుగైదు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - అర టీస్పూన్‌, చాట్‌మసాల - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ఒకబౌల్‌లో హంగ్‌ కర్డ్‌ తీసుకోవాలి. తరువాత అందులో క్యారెట్‌ తురుము, కీరదోస తురుము, తరిగిన ఉల్లిపాయ, ఉల్లి కాడలు, కొత్తిమీర, మిరియాల పొడి, చాట్‌మసాల, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్‌పై సమంగా పరవాలి. తరువాత పైన మరో బ్రెడ్‌ పెట్టి నాలుగు ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.  టొమాటో కెచ్‌పతో అందిస్తే ఈ శాండ్‌విచ్‌ను పిల్లలు ఇష్టంగా తింటారు.

Updated Date - 2022-03-12T18:31:37+05:30 IST