జాతీయ సమైక్యత స్ఫూర్తి రగిలించేలా వజ్రోత్సవాలు

ABN , First Publish Date - 2022-08-08T05:12:58+05:30 IST

జాతీయ సమైక్యత సూర్తి రగిలించేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహిం చాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు.

జాతీయ సమైక్యత స్ఫూర్తి రగిలించేలా వజ్రోత్సవాలు
ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సండ్ర

ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి, ఆగస్టు 7: జాతీయ సమైక్యత సూర్తి రగిలించేలా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహిం చాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. నాటి మహనీయుల త్యాగాలను నేటి తరానికి వివరించే విధంగా కార్యక్రమాలు ఉండాలన్నారు. ఆదివారం మునిసిపల్‌ కార్యా లయంలో జరిగిన వజ్రోత్సవాల నిర్వహణ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర వజ్రోత్సవాలను రాష్ట్రంలో సోమవారం నుంచి ఈ నెల 22 వరకూ నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని తెలిపారు. ఇందులో భాగంగా సోమవారం స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ప్రారంభం, 9వ తేదీన ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభం, పదిన భాగంగా మొక్కలు నాటటం, 11న 2కే రన్‌ 12న రాఖీ దినోత్సవం సందర్భంగా వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారం, 13న అన్ని వర్గాల వారితో వజ్రోత్సవ ర్యాలీ, 14న సాయంత్రం సాంస్కృతిక సారధి కళాకారుల ఆటపాటలు, 15న స్వాతంత్య్ర వేడుకలు, ఇంటింటా పతాకావిష్కరణ, 16న పట్టణంలో అన్ని వార్డుల్లో జాతీయ గీతాలాపన, సాయంత్రం కవి సమ్మేళనాలు, 17న రక్తదాన శిబిరాలు, 18న ఫ్రీడం కప్‌ పేరుతో క్రీడల నిర్వహణ, 19న దవాఖానాలు, శరణాలయాల్లో, జైళ్లలో పండ్లు, మిఠాయిలు పంపిణీ, 20న దేశభక్తి, జాతీయ సూర్తి చాటేలా ముగ్గుల పోటీ, 21న అసెంబ్లీ స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం, 22న వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఏసీపీ ఎన్‌.వెంకటేష్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌, కమీషనర్‌ సుజాత పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:12:58+05:30 IST