ఆ సినిమాలో నేను ఆ నటుడిని దాదాపు చంపేశా.. దావా వేయెుచ్చు కానీ..: నటి

సినిమా షూటింగ్ అంటే ఎంతో సరదాగా సాగిపోతుందని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ వారు కొన్ని రిస్కీ సీన్లు చేస్తూ కొన్నిసార్లు ప్రమాదాలకు సైతం గురవుతుంటారు. అలాంటి సిట్యూవేషన్‌నే ఎదుర్కొన్నాడు హాలీవుడ్ నటుడు మైఖేల్ కెయిన్. 2000లో స్టార్ హీరోయిన్ శాండ్రా బుల్లక్‌తో కలిసి ఈ స్టార్ నటించిన చిత్రం ‘మిస్ కన్జెనియాలిటీ’.


ఈ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను బుల్లక్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకుంది. అందులో.. ‘నేను చేసిన కొన్ని పనుల వల్ల మైఖేల్ కెయిన్ అనుకోకుండా స్టేజ్ దగ్గరలో ఉన్న ఓ గుంటలో పడిపోయాడు. ఆ సమయంలో ఆయనపై లైట్స్ పడడంతో మేము చూశాం. ఈ కారణాన్ని చూపి మాపై దావా వేయొచ్చు. కానీ అలా చేయలేద’ని చెప్పుకొచ్చింది. ‘ఆ ప్రమాదంలో చాలా గాయపడ్డాడు కెయిగ్.  నేను ఆ సమయంలో అతను చనిపోయేవాడే. కానీ అతనో మృగంలాంటి వాడు. అందుకే కోలుకొని మళ్లీ కెరీర్‌ని కొనసాగించాడు.. ఇంకా మంచి స్థాయి చేరుకున్నాడు. అది ఎంతో సరదాగా సాగిన షూటింగ్.. కానీ ఎంతో కష్టతరమైనద’ని తెలిపింది.

Advertisement