గంధపు చెక్కల చోరీ ముఠా అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-01-26T06:06:03+05:30 IST

శ్రీగంధపు చెక్కల ను అపహరించిన దొంగల ముఠాలోని ఏడుగురు నిందితు లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 44 లక్షలు విలువ చేసే 68 బ్యాగులలో నింపిన గంధపు చెక్కలు, 16 కేజీల శ్రీ గంధం ఆయిల్‌, రెండు గూడ్స్‌ లారీలు, ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసు కున్నారు.

గంధపు చెక్కల చోరీ ముఠా అరెస్ట్‌
పట్టుబడిన నిందితులతో ఎస్పీ, అటవీశాఖాధికారి, డీఎస్పీ


కటకటాల్లోకి ఏడుగురు నిందితులు

రూ. 44 లక్షలు విలువ చేసే శ్రీగంధపు చెక్కలు స్వాధీనం

రెండు గూడ్స్‌ లారీలు, ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు కూడా...

పరారీలో మరో ఆరుగురు నిందితులు


అనంతపురం క్రైం, జనవరి 25: శ్రీగంధపు చెక్కల ను అపహరించిన దొంగల ముఠాలోని ఏడుగురు నిందితు లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ. 44 లక్షలు విలువ చేసే 68 బ్యాగులలో నింపిన గంధపు చెక్కలు, 16 కేజీల శ్రీ గంధం ఆయిల్‌, రెండు గూడ్స్‌ లారీలు, ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసు కున్నారు. మిగిలిన ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నా రు. వివరాలను జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, జిల్లా అటవీ శాఖాధికారి సందీ్‌పకృపాకర్‌, పెనుకొండ డీఎస్పీ రమ్య, సీఐలు వెంకటేశ్వర్లు, హామీద్‌ఖాన, ఎస్‌ఐలు రమే్‌షరెడ్డి, వెంకటరమణ, మక్బూల్‌బాషా, రంగడు తదితర సిబ్బంది తో కలిసి స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో మంగళ వారం విలేకరులకు వెల్లడించారు.


నిందితులంతా స్నేహితులు, పాత నేరస్తులే..

కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన ఎంబీ సయ్యద్‌ అజీజ్‌ ఉర్‌ రెహమాన, పాలక్షప్ప ఎన పెటాయిన, తబ్రెజ్‌ అలియాస్‌ మహమ్మద్‌ జమీల్‌, శ్యామ్‌ రావు జగన్నాథ్‌ తడకే, గజన ఫక్‌ఖాన, నాగరాజు, సురేష్‌, సమీఉల్లా, బాబ్‌జాన, సెల్వం, నవీద్‌, ఫీరోజ్‌, సల్మానలు గత కొన్నేళ్లుగా స్నేహితులు. వీరందరూ కలిసి ముఠాగా ఏర్పాడి పలు రాషా్ట్రలో ఎర్ర చందనం, గంధపు చెక్కల  దొంగతనాలకు పాల్పడ్డారు. వీరందరిపై రాయలసీమ జిల్లాలతో పాటు కర్ణాటక తదితర ప్రాంతాలలో కేసులు నమోదై జైలుపాలయ్యారు. బయటకు వచ్చిన తరువాత కూడా యథేచ్ఛగా దొంగతనాలకు తెరలేపారు. ఈ క్రమం లో పెనుకొండ ఫారెస్ట్‌ కార్యాలయంలో గంధపు చెక్కలు డంప్‌ చేసినట్లు ఈ ముఠాకు తెలిసింది.


 పథకం ప్రకారం విడతల వారీగా చోరీ 

ముఠాలోని 13మంది నిందితులు కలిసి గుట్టుచప్పుడు కాకుండా విడతల వారిగా పెనుకొండ అటవీశాఖ కార్యాల యంలో డంప్‌ చేసిన శ్రీగంధపు చెక్కలను అపహరించా రు. శివమొగ్గలో ప్యూహరచన చేసుకుని ముఠా సభ్యులు ఈనెల 5న పెనుకొండ అటవీశాఖ కార్యాలయంపై రెక్కీ నిర్వహించారు. ఈనెల 8న రాత్రి కార్యాలయం వెనుకవైపు కిటికిని తొలగించి గంధపు చెక్కలతో నింపిన 25 సం చులను ఎత్తుకెళ్లారు. ఎవరికి అనుమానం రాకుండా కిటికి ని యఽథాతథంగా అమర్చారు. 9న రాత్రి కూడా అదేవి ధంగా కిటికిని తొలిగించి 30 సంచులతో ఉడాయించారు.  10న కూడా 26 సంచులను అపహరించారు. తర్వాత 13న కూడా 11 సంచులతో పాటు 12 కేజీల ఆయిల్‌ డబ్బాతో ఉడాయించి ఎవరికి అనుమానం రాకుండా కర్ణా టకలోని శివమొగ్గలోని ఓ రహస్య ప్రాంతంలో డంప్‌ చేశారు. దొంగిలించిన ఈ సామగ్రిని అధిక ధరకు విక్ర యించాలని ఈనెల 24న శివమొగ్గ నుంచి వాహనాలలో గంధపు చెక్కలను వేసుకుని తమిళనాడులోని చెన్నైకు బయల్దేరారు.  


పట్టుబడింది ఇలా...

అటవీశాఖ కార్యాలయంలో గంధపు చెక్కలు చోరీ అయిన  విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో సంబంధిత ఫారెస్ట్‌ రేం జ్‌ అధికారి రాంసింగ్‌ ఈనెల 19న పెనుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీఎస్పీ ర మ్య, సీఐలు వెంకటేశ్వరులు, హమీద్‌ఖాన, ఎస్‌ఐలు వెంకటర మణ, రమే్‌షబాబు, మ క్బూల్‌బాషా, రంగడు తదితర సిబ్బంది బృందాలుగా ఏర్పడి ద ర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ముఠా సభ్యులు గంధపు చెక్కల తో నింపిన వాహనాలతో పెనుకొండ సమీప ప్రాంతాల గుండా తమిళనాడుకు ఈనెల 24న వెళ్తుండగా దాడులు చేశారు. ముఠాలోని ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చేయగా మిగిలిన ఆరుగురు పరారయ్యారు. వీరి కోసం గా లింపు చర్యలు ముమ్మరం చేసినట్లు ఎస్పీ వివరించారు. కేసు ఛేదించిన పోలీసులకు అభినందనలతో పాటు రివార్డులు ప్రకటించారు. 


ఉద్యోగుల పాత్ర ఉంటే  వదిలేది లేదు - ఎస్పీ ఫక్కీరప్ప, అటవీశాఖాధికారి సందీప్‌ కృపాకర్‌ 

గంధపు చెక్కల అపహరణ కేసుకు సంబంధించి అటవీశాఖ ఉద్యోగుల ప్రమేయం ఏమాత్రం ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. లో తుగా విచారణ చేస్తున్నాం. నిర్లక్ష్యంతో వ్యవహరించిన వారిపై ఇదివరకే శాఖపరమైన చర్యలు తీసుకున్నాం. గంధపు చెక్కల ము ఠాతో ఏమైనా సంబంధా లు ఉన్న ట్లు విచారణలో తేలితే కఠిన చర్యలు తీసుకుం టాం. మిగిలిన నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్‌ చేస్తాం.


Updated Date - 2022-01-26T06:06:03+05:30 IST