భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు

ABN , First Publish Date - 2021-10-19T06:19:02+05:30 IST

మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరిం చుకుని సోమవారం సాయంత్రం సాయి నగర్‌లో గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన గౌస్‌మోద్దీన్‌ తన నివాసం నుంచి ము ిస్లింలతో కలిసి సూర్యనగర్‌ 80 అడుగుల రోడ్డు, పాతూరులలో గంధం ఊరేగింపు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో గంధం ఊరేగింపు
గంఽధాన్ని ఊరేగిస్తున్న దృశ్యం



అనంతపురం టౌన, అక్టోబరు 18 : మిలాద్‌-ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరిం చుకుని సోమవారం సాయంత్రం సాయి నగర్‌లో గ్రంథాలయసంస్థ మాజీ చైర్మన గౌస్‌మోద్దీన్‌ తన నివాసం నుంచి ము ిస్లింలతో కలిసి సూర్యనగర్‌ 80 అడుగుల రోడ్డు, పాతూరులలో గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పామిడి దర్గాకు వెళ్లి గంధం సమర్పించారు. మఽ ద్యాహ్నం దాదాపు 2500 మందికి అన్న దాన వినియోగం చేశారు. ఈ సందర్భంగా గౌస్‌మోద్దీన్‌ మా ట్లాడుతూ... సేవతోనే సమసమాజ స్థాపన సాధ్యమ వుతుందని, అందుకే ప్రతిఒక్కరూ సేవాగుణాన్ని అలవరచు కోవాలన్నారు. మహమ్మద్‌ ప్రవక్త సూచించిన సూక్తులు స మాజం మొత్తం అనుసరించదగ్గవన్నారు. కార్యక్రమంలో ము స్లిం మతపెద్దలు షెక్షా, జావీద్‌, జాఫర్‌, టీడీపీ నాయకులు రాయల్‌ మురళి, కృష్ణకుమార్‌, బుగ్గయ్య చౌదరి, కిరణ్‌ కుమార్‌ గౌడ్‌, విశాలాక్షమ్మ, సాలార్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

పాతూరులో... పాతూరులోని మాసుమాబీబీ దర్గా వద్ద సోమవారం రాత్రి ఫకీర్ల డప్పులు, మతపెద్దల ప్రసం గాల నడుమ గంధం ఊరేగింపును వైభవంగా నిర్వహించారు. అనంతరం పదిరోజులనుంచి మహమ్మద్‌ ప్రవక్త జీవితంపై ఆధ్యాత్మిక ప్రసంగాలు చేసిన మతపెద్దలు, మౌలానాలను ఘనంగా సత్కరించారు. ఆసార్‌ వీధి, మాసుమాబీబీ దర్గా, నాలబంద్‌ వీధుల్లో విశేషంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు.

గార్లదిన్నె : మండల పరిధిలోని కల్లూరులో సోమవారం రాత్రి మిలాద్‌ - ఉన - నబి పండుగను ముస్లింలు ఘనంగా నిర్వహించారు. జామియా మసీదు నుంచి గంఽధాన్ని పురవీఽ దుల గుండా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మహబూబ్‌బాషా, ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-19T06:19:02+05:30 IST