అల్లూరి పార్కులో గంధం చెట్లు నరికివేత

ABN , First Publish Date - 2020-11-30T06:38:41+05:30 IST

గొలుగొండ మండలం కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కులో విలువైన గంధం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి పరారయ్యారు.

అల్లూరి పార్కులో గంధం చెట్లు నరికివేత
పార్కులో నేలకొరిగిన గంధం చెట్టు

కృష్ణాదేవిపేట, నవంబరు 29 : గొలుగొండ మండలం   కృష్ణాదేవిపేటలోని అల్లూరి పార్కులో విలువైన గంధం చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికి పరారయ్యారు. పార్కులో సుమారు పది గంధం మొక్కలు ఐదేళ్ల క్రితం నాటారు. ఇందులో ఐదు ఏపుగా పెరిగాయి. గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి పార్కు వెనుక భాగంలో ఉన్న ఇసుప కంచెలో నుంచి ప్రవేశించారు. ఒక చెట్టును మొదళ్లకు నరకగా, నాలుగు చెట్లను నరికే ప్రయత్నం చేశారు. ఇంతలో వాచ్‌మేన్‌ లగుడు చినబాబు చప్పుడు చేసుకుంటూ వెళ్లేసరికి వాటిని వదిలి పరార య్యారు. ఈ ఘటన జరిగి మూడు రోజులు కావస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం.

Updated Date - 2020-11-30T06:38:41+05:30 IST