మూడురోజుల్లోగా ఇసుక సరఫరా: జేసీ

ABN , First Publish Date - 2020-06-07T07:58:18+05:30 IST

భవన నిర్మాణాలు తదితర వాటికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మూడురోజుల్లోగా ఇసుక

మూడురోజుల్లోగా ఇసుక సరఫరా: జేసీ

చిత్తూరు కలెక్టరేట్‌, జూన్‌ 6: భవన నిర్మాణాలు తదితర వాటికి సంబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న మూడురోజుల్లోగా ఇసుక సరఫరా చేస్తామని జేసీ మార్కొండేయులు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిల్లా అధికారులకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ... జిల్లాలో 35 రీచ్‌ల పరిధిలో 2800 మెట్రిక్‌ టన్నుల ఇసుక లభ్యత ఉందని చెప్పారు. దీనిని 5 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచితే ఇసుక కొరత ఉండదని గుర్తుచేశారు. ఆ మేరకు అరణియార్‌ నదిలో త్వరలో ఇసుక రీచ్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు. ట్రైనీ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, జిల్లా శాండ్‌ ఆఫీసర్‌ అమీర్‌బాషా, ఏడీలు రామచంద్రరావు, అశోక్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-06-07T07:58:18+05:30 IST