ప్రభుత్వం ఇసుక ధరలను వెంటనే తగ్గించాలి

ABN , First Publish Date - 2021-08-06T05:56:37+05:30 IST

ఇసుక ధర లు భారీగా పెరడంతో భవన నిర్మాణ కార్మికుల కు పనులు లేవని, అందువల్ల ప్రభుత్వం వెంట నే ఇసుక ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాల ని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కా ర్యదర్శి బి.హరికృష్ణ డిమాండ్‌ చేశారు. కరోనా స మయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కరోనా భృతి రూ.20వేలు ఇవ్వాల న్నారు.

ప్రభుత్వం ఇసుక ధరలను వెంటనే తగ్గించాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహిస్తున్న భవన నిర్మాణ కార్మికులు

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 5 : ఇసుక ధర లు భారీగా పెరడంతో భవన నిర్మాణ కార్మికుల కు పనులు లేవని, అందువల్ల ప్రభుత్వం వెంట నే ఇసుక ధరలు తగ్గించేలా చర్యలు తీసుకోవాల ని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కా ర్యదర్శి బి.హరికృష్ణ డిమాండ్‌ చేశారు. కరోనా స మయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న కార్మికులకు కరోనా భృతి రూ.20వేలు ఇవ్వాల న్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యం లో గురువారం స్థానిక కలెక్టరేట్‌ వద్ద ధర్నా ని ర్వహించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లా డుతూ ప్రస్తుతం ట్రక్కు ఇసుక రూ.6వేలు ప లుకుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాత ఇసుక విధానాన్ని కొనసాగించాలని కోరారు. భ వన నిర్మాణ సంక్షేమ బోర్డును మూసివేసే దిశ కు ప్రభుత్వం తీసుకవచ్చిందని ఆరోపించారు. సె స్‌ ద్వారా వేల కోట్లు వసూలు చేస్తే ప్రభుత్వం అవసరాల కోసం వాడుకొని క్లైయిమ్స్‌కు చెల్లించ కుండా కార్మికులను ఇబ్బందులు పెడుతుందని విమర్శించారు. సంక్షేమ బోర్డు ద్వారా కార్మికు లకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ కార్యదర్శి పీవీఆర్‌.చౌదరి, ప్రతిని ధులు వెంకటేశ్వర్లు, వేణు, ఎన్‌.రామకృష్ణ, కృష్ణవే ణి, రమేష్‌, రాజు, ఇండ్ల సరస్వతి పాల్గొన్నారు.


Updated Date - 2021-08-06T05:56:37+05:30 IST