త్వరలో ఇసుక ర్యాంపులు ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-22T05:52:17+05:30 IST

త్వరలో ఇసుక ర్యాంపులు ప్రారంభమవుతున్నాయి. ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఆచంట నియోజకవర్గంలో ఇప్పటికే కరుగోరుమిల్లిలో పడవల ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.

త్వరలో ఇసుక ర్యాంపులు ప్రారంభం
కోడేరు ఇసుక ర్యాంప్‌ వద్ద బాట

 కోడేరు, కరుగోరుమిల్లి, సిద్ధాంతం ర్యాంపుల్లో బాటలు ఏర్పాటు 

 బాటల నిర్వహణ మాత్రం అధికార పార్టీ నాయకులదే..

ఆచంట, జనవరి 21 : త్వరలో ఇసుక ర్యాంపులు ప్రారంభమవుతున్నాయి. ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఆచంట నియోజకవర్గంలో ఇప్పటికే కరుగోరుమిల్లిలో పడవల ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. పెనుగొండ మండలం నడిపూడిలో మిషన్ల ద్వారా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆచంట మండలంలో కోడేరు, కరుగోరుమిల్లితోపాటు పెనుగొండ మండలంలోని సిద్ధాంతం ర్యాంపుల బాధ్యత ప్రభుత్వం ఇటీవల జేపీ సంస్థకు అప్పగించింది. ఈ మూడు చోట్ల త్వరలో ర్యాంపులు ప్రారంభించేందుకు బాటలు వేస్తున్నారు. ఇసుక తవ్వకాలు జేపీ సంస్థ ఆధ్వర్యంలో.. ఈ మూడు చోట్ల బాటల నిర్వహణ పనుల్లో అధికార పార్టీ నాయకులు నిమగ్నమ య్యారు. బాటలు వేసి జేపీ సంస్థకు అప్పగిస్తే.. అధికార పార్టీ నాయకులు ఖర్చులు ఇస్తారని సమాచారం. ర్యాంపులు ప్రారంభమైన తరువాత పరిస్థితి ఏ విధంగా ఉంటోందో చూడాలని పలువురు అంటున్నారు. 

కోడేరు ర్యాంపు వద్ద వంతెన బలహీనం..

ఆచంట మండలం కోడేరు ర్యాంపునకు సంబంధించి వున్న వంతెన బలహీనంగా ఉందని గతంలోనే కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఈ వంతెనపై భారీ వాహనాలు వెళ్లడానికి అనుమతి లేదు. ట్రాక్టర్‌ మాత్రమే వెళ్లడానికి అనుమతి ఉందంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.  నియోజకవర్గంలో అన్ని ర్యాంపులు సక్రమంగా జరిగినా, కోడేరులో జరిగే అవకాశాలు ఉండవని పలువురు మాట్లాడుతున్నారు.  

Updated Date - 2022-01-22T05:52:17+05:30 IST