Abn logo
Sep 26 2021 @ 00:48AM

ఇసుక లేక ఎక్కడి పనులు అక్కడే!

గబ్బాడ సమీప యార్డులో ఇసుక నిల్వలు నిండుకున్న దృశ్యం

  గబ్బాడ సమీప యార్డులో నిండుకున్న నిల్వలు 

నిలిచిపోయిన జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాలు 

 ప్రైవేటు నిర్మాణాలదీ అదే పరిస్థితి 

గత ఏడాది అనుభవాల నుంచి పాఠాలు నేర్వని అధికారులు

నర్సీపట్నం, సెప్టెంబరు 25 : గబ్బాడ సమీపంలోని యార్డులో ఇసుక నిల్వలు లేకపోవడంతో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. గత పది రోజులుగా ఇసుక సరఫరా నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది మే వరకు ప్రభుత్వం ఏపీఎండీసీ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వారికి ఇసు కను సరఫరా చేసేది. మే 17 నుంచి జయప్రకాశ్‌ పవర్‌వెంచర్‌ లిమిటెడ్‌ అనే ప్రైవేటు కాంట్రాక్టర్‌కు ఇసుక సరఫరా కాంట్రాక్ట్‌ను ప్రభుత్వం అప్పగించింది. టన్ను ఇసుక రూ.1400కు విక్రయి స్తున్నారు. ఈ సంస్థ మే  17 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు ఏడు వేల టన్నుల  ఇసుకను విక్రయించింది. అయితే, రాజ మండ్రి నుంచి ఇసుక సరఫరా చేయకపోవడంతో గత పదిహేను రోజులుగా యార్డులో ఇసుక నిల్వలు ఖాళీ అయిపోయాయి. రాజమండ్రిలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడం వల్ల ఇసుక తేవడం ఇబ్బందిగా మారిం దని నిర్వా హకులు చెపుతున్నారు. మరో పదిహేను రోజుల వరకు ఇసుక సరఫరా కష్టమని అంటున్నారు. దీంతో జగనన్న కాలనీలతో పాటు ప్రైవేటు నిర్మాణాలు నిలిచిపోయాయి. వేలాది మంది నిర్మాణ రంగం కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్థానికంగా ఇసుక దొరికినచోట పనులు జరుగుతున్నప్పటికీ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి.

ముందస్తు ప్రణాళిక లేకే ఇబ్బంది

గోదావరికి వరద వచ్చిందంటే ఇసుక తవ్వకాలకు ఇబ్బంది తలెత్తుతుందని తెలిసినప్పటికీ  అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ సమస్య ఏర్పడింది. గత ఏడాది కూడా ఇసుక కొరత ఏర్పడి కార్మికులు రోడ్డున పడ్డారు. గత అను భవాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని లబ్ధి దారులు వాపోతున్నారు. దీనిపై జయప్రకాశ్‌ పవర్‌ వెంచర్‌ లిమిటెడ్‌ ఇన్‌చార్జ్‌ సుదర్శన్‌ను వివరణ కోరగా, మరో  పది హేను రోజులు వరకు ఇసుక సరఫరా చేయలేమని చెప్పారు. జగనన్న కాలనీ ఇళ్లకు ముందు ఇసుక ఇచ్చాకే తర్వాత మిగిలిన వారికి అందిస్తామని చెప్పారు.