Abn logo
Sep 19 2021 @ 02:50AM

ఇసుక.. మస్కా!

టెండర్‌లో ఒక క్వారీ.. తవ్వేది మరో క్వారీలో.. 

జోరుగా అదనపు బకెట్‌ దందా .. మూసేసిన క్వారీలో తవ్వకాలపై అనుమానాలు

అక్రమ వ్యాపారానికి టీఎ్‌సఎండీసీ వత్తాసు.. రూ.200 కోట్ల ఇసుకను దోచుకున్నారనే టాక్‌

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి): ఇసుక తవ్వకాల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నా యి. టెండర్లు వేసిన క్వారీలో కాకుండా మరో క్వారీలో త వ్వుతూ కాంట్రాక్టర్లు అక్రమాలకు తెర లేపుతున్నారు. తమ కు కేటాయించిన క్వారీల్లో నిల్వలు లేవని, మరో క్వారీ నుంచి ఇసుకను తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని కాంట్రాక్టర్లు అడిగిందే తడువుగా టీఎ్‌సఎండీసీ అధికారులు అప్పనంగా అప్పజెప్పడం అనుమానాస్పదంగా మారింది. అదనపు బకెట్‌, బల్క్‌ సరఫరాతో క్వారీల్లోని ఇసుకను ఖాళీ చేసి, కొత్త క్వారీలను ఆక్రమించుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సమీపంలోని ఇసుక క్వారీల్లో సుమారు రూ.200 కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు దోచుకున్నారనే టాక్‌ వినిపిస్తోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండల పరిధిలోని గోదావరి నది నుంచి ఇసుకను వెలికి తీయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


కాళేశ్వరం ప్రాజెక్టుతో అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల్లో పేరుకున్న ఇసుక పూడికను తొలిగించి, విక్రయించే బాధ్యతను తెలంగాణ మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీఎ్‌సఎండీసీ)కు అప్పగించింది. దీంతో టీఎ్‌సఎండీసీ అధికారులు కాళేశ్వరం పరిఽధిలో 29 క్వారీల ద్వారా 3,78,02,279 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వెలికి తీసేందుకు కాంట్రాక్టర్లకు టెండర్లు అప్పగించింది. ఒక క్యూబిక్‌ మీటర్‌ ఇసుకను రూ.600కు విక్రయిస్తోంది. ఇప్పటికే సుమారు 2,61,56,931 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వెలికి తీశారు. దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ.1427.77 కోట్ల ఆదాయం సమకూరింది. 


తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత..

కాళేశ్వరం సమీపంలోని ఇసుక క్వారీల్లో అక్రమార్కులు అధికారుల కనుసన్నల్లో ఇసుకను మాయం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మహదేవపూర్‌ మండలం బొమ్మాపూర్‌-1 క్వారీకి మొత్తం 21,60,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వెలికితీసేందుకు టెండర్లు నిర్వహించారు. అయితే, తమ క్వారీలో నిర్దేశించిన స్థాయిలో ఇసుక నిల్వలు లేవని, ఇం కా 5,50,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుక కొరత ఉందని, దీన్ని మహదేవపూర్‌-5 క్వారీలో తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వాలని సదరు కాంట్రాక్టరు అడిగిందే తడువుగా టీఎ్‌సఎండీసీ అధికారులు అనుమతి ఇచ్చారు. మహదేవపూర్‌-5 క్వారీలో గతంలో కేటాయించిన 17,40,000 క్యూబిక్‌ మీటర్ల ఇసుకలో 3 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుక మాత్రమే లభ్యం కావడంతో సదరు కాంట్రాక్టరు తన కాంట్రాక్ట్‌ను రద్దు చే సుకొని వెళ్లిపోయాడు. అప్పుడు లేని ఇసుక ఇప్పుడెట్లా లభిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అలాగే ఎల్కేశ్వరం క్వారీకి మొత్తం 24 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను వెలికి తీయాలనే టార్గెట్‌తో 2017లో టెండర్లు నిర్వహించారు.


ప్రస్తుతం మరో 4 లక్షల క్యూబిక్‌ మీట ర్ల ఇసుక షార్టేజ్‌ వస్తోందని, తమకు కూడా వేరే క్వారీ లో ఈ మొత్తాన్ని తవ్వుకునేలా అనుమతులు ఇవ్వాల న్న సదరు కాంట్రాక్టరు విజ్ఞప్తితో పూస్కుపల్లి-1 క్వారీకి బదలాయించారు. అయితే, గతంలోనే పూస్కుపల్లి-1 క్వారీలో బండరాళ్లతో ఇసుక తీసేందుకు వీలు లేకపోవడంతో మొదట్లోనే సదరు కాంట్రాక్టరు తన టెండరును రద్దు చేసుకుని వెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఎల్కేశ్వరం క్వారీలోనే మిగతా లక్ష క్యూబి క్‌ మీటర్ల ఇసుకను తవ్వుకునేందుకు టీఎ్‌సఎండీసీ అధికారులు అనుమతి ఇచ్చారు. ఎల్కేశ్వరం క్వారీలో ఇసుక లభ్యత లేదనే పూస్కుపల్లి-1 క్వారీకి బదలాయించారు. హైదరాబాద్‌ కార్యాలయం నుంచి వస్తున్న అర్డర్లనే తాము అమలు చేస్తున్నామని స్థానిక అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న ఇసుకాసురులపై ఇప్పటికైనా టీఎ్‌సఎండీసీ ఉన్నతాధికారులు దృష్టి సారించాలని, అక్రమంగా  క్వారీలను రద్దు చేసి బల్క్‌ సరఫరా దందాపై కఠినంగా వ్యవహరించాలని స్థానికులు కోరుతున్నారు.

తెలంగాణ మరిన్ని...