ఇసుక విధానం లోపభూయిష్టం

ABN , First Publish Date - 2020-05-31T10:01:11+05:30 IST

ఇసుక విధానంలో ప్రభుత్వ నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయి.

ఇసుక విధానం లోపభూయిష్టం

ఐ.పోలవరం, మే 30: ఇసుక విధానంలో ప్రభుత్వ  నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఆన్‌లైన్‌ సిస్టం నుంచి డోర్‌ డెలివరీ విధానం వరకు కార్మికులు,  వినియో గదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ డీడీ విధానంలో ఇసుక సరఫరా చేయడంతో కార్మికుల కష్టార్జితం సకాలంలో చేతికి అంద కపోవడంతో వారికి పూట గడవని పరిస్థితి నెలకొంది. ఐ.పోల వరం మండలంలో అతిపెద్దది మురమళ్ల ఇసుక ర్యాంపు. తొమ్మిది బోట్లకు సంబంధించి 45మంది కార్మికులు పనిచేస్తున్నారు. కూలీ డబ్బులు సకాలంలో అందకపోవడంతో ఇసుక తీసేందుకు కార్మికులు ముందుకు రాకపోవడంతో జనవరి నుంచి ఈ ర్యాంపు మూతపడింది. 


ఏపీఎండీసీ ద్వారా ఇసుక సరఫరా జరగడంతో జనవరి నుంచి ఇప్పటివరకు  రూ.2.27లక్షలు కార్మికులకు విడుదల కావలసి ఉంది. ర్యాంపు నిర్వహణ, బిల్లుల విడుదలలో అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లభించకపోవడంతో భవన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపో యాయి. అధికార పార్టీ నాయకులు మాత్రం ఇసుకను లారీల ద్వారా తరలించుకుపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నా యి. బిల్లులు వెంటనే విడుదల చేసి ర్యాంపు పునః ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.


నాలుగు నెలల నుంచి ఉపాధి కోల్పోయాం: శీలం శ్రీనివాసరావు, సొసైటీ అధ్యక్షుడు 

బిల్లులు సకాలంలో అందకపోవ డంతో ఆర్థికంగా ఇబ్బందులు పడు తున్నాం. కుటుంబాన్ని పోషించుకు నేందుకు నానా ఇబ్బందులు పడు తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్‌ బిల్లులు త్వరి తగతిన విడుదలచేసి కార్మికులకు న్యాయం చేయాలి.


Updated Date - 2020-05-31T10:01:11+05:30 IST