ఇసుక మాఫియాపై ప్రమాణాలు

ABN , First Publish Date - 2022-02-13T17:52:53+05:30 IST

శివమొగ్గ జిల్లా సాగర నియోజకవర్గంలో ఇసుక మాఫియాపై సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే హరతాళు హాలప్ప ఇసుక మాఫియా నుంచి మామూళ్లు తీసుకున్నారని మాజీ

ఇసుక మాఫియాపై ప్రమాణాలు

- ధర్మస్థళ ఆలయానికి విచ్చేసిన సాగర ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే  

- ఆగని మాటల తుటాలు


బెంగళూరు: శివమొగ్గ జిల్లా సాగర నియోజకవర్గంలో ఇసుక మాఫియాపై సాగుతున్న ఆరోపణలు, ప్రత్యారోపణలు తారస్థాయికి చేరాయి. ఎమ్మెల్యే హరతాళు హాలప్ప ఇసుక మాఫియా నుంచి మామూళ్లు తీసుకున్నారని మాజీ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ ఆరోపించారు. ధర్మస్థళ మంజునాథ ఆలయంలో ప్రమాణం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే సవాల్‌కు స్పందించారు. శనివారం ఎమ్మెల్యే హరతాళు హాలప్ప ధర్మస్థళ ఆలయానికి వెళ్లారు. అనుచరులతో కలసి మంజునాథస్వామిని దర్శించుకుని బహిరంగ ప్రమాణం చేశారు. ఇసుక మాఫియా నుంచి ఎటువంటిక మీషన్లు తీసుకోలేదని ప్రమాణం చేశారు. ఆప్తులైన వినాయకరావు, బీటీ రవీంద్రతో కలసి ప్రమాణం చేశారు. అనవసరంగా బేళూరు ఆరోపణలు చేస్తున్నారన్నారు. దేవుడి ఎదుట ప్రమాణం చేయాలనే సవాల్‌కు స్పందించానన్నారు. ఎమ్మెల్యే హాలప్ప ధర్మస్థళకు చేరుకునేందుకు ముందుగానే మాజీ ఎమ్మెల్యే బేళూరు గోపాలకృష్ణ వచ్చారు. ఆయన దేవుడిని దర్శనం చేసుకున్నారు. తన ఆరోపణలలో వాస్తవం ఉందని ఆయన ప్రకటించారు. ప్రమాణాలు చేసే సందర్భంలో పరస్పరం ఎదురెదురుగా నిలబడి ఆచరించాల్సి ఉంటుంది. కానీ ఎమ్మెల్యే వచ్చేసరికే మాజీ ఎమ్మెల్యే ధర్మస్థళ నుంచి వెనుతిరిగారు. ఎమ్మెల్యే హాలప్ప ప్రమాణం చేసిన తర్వాత ధర్మాధికారి వీరేంద్రహెగ్డేను కలసి ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చిందీ వివరించారు. 

Updated Date - 2022-02-13T17:52:53+05:30 IST