నెల్లూరులో ఇసుక రాజకీయం

ABN , First Publish Date - 2021-06-25T17:11:27+05:30 IST

నెల్లూరు: నగరంలో ఇసుక రాజకీయం దూమారం రేపుతోంది.

నెల్లూరులో ఇసుక రాజకీయం

నెల్లూరు: నగరంలో ఇసుక రాజకీయం దూమారం రేపుతోంది. పెన్నానదిలో అక్రమ ఇసుక తవ్వకాలను నిరసిస్తూ నాలుగు రోజులుగా విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నాయి. నిన్న అఖిలపక్ష పార్టీల నేతలతో సమావేశం నిర్వహించిన నేతలు.. శుక్రవారం నేరుగా నదిలో తవ్వకాల ప్రాంతాలను పరిశీలించారు.


రాత్రికి రాత్రే రెండు జేసీబీలతో గుంటలను చదును చేస్తుండగా టీడీపీ నేతలు, కార్యకర్తలు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే దీనిపై స్పందించిన అధికారులు తాము జేసీబీలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. అటు ఇసుక తవ్వకాలపై మంత్రి అనిల్ కూడా స్పందించారు. పెన్నానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరగలేదని జగనన్న ఇళ్ల స్థలాలకు మాత్రమే ఇసుక ఇస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. అయితే మంత్రి ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. కళ్లముందే ఇసుక అక్రమంగా తరలిస్తున్నా.. మంత్రికి కనిపించడంలేదా? అని ప్రశ్నించారు.

Updated Date - 2021-06-25T17:11:27+05:30 IST