ఇసుక మళ్లీ దోపిడీ

ABN , First Publish Date - 2021-03-05T06:56:33+05:30 IST

ఇసుక దోపిడీ మరింత పెరిగింది. ప్రస్తుతం కొత్త విధానం తేవడానికి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియలో నిమగ్నంకాగా, జిల్లాలో ఇసుక వ్యాపారులు ఇష్టాను సారం దోపిడీకి పాల్పడుతున్నారు. పగటిపూట మానేసి, రాత్రి వేళల్లో డ్రెడ్జింగ్‌ మొదలు పెట్టారు.

ఇసుక మళ్లీ దోపిడీ

  • ఓపెన్‌ రీచ్‌లలో నకిలీబిల్లులు
  • జిల్లాలో 41రీచ్‌ల వరకూ ఉంటే కొన్ని రీచ్‌లకే ఆన్‌లైన్‌ అనుమతి
  • బల్క్‌ ఆర్డర్లకు లంచాలు మరిగిన సీసీలు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఇసుక దోపిడీ మరింత పెరిగింది. ప్రస్తుతం కొత్త విధానం తేవడానికి ప్రభుత్వం టెండర్ల ప్రక్రియలో నిమగ్నంకాగా, జిల్లాలో ఇసుక వ్యాపారులు ఇష్టాను సారం దోపిడీకి పాల్పడుతున్నారు. పగటిపూట మానేసి, రాత్రి వేళల్లో డ్రెడ్జింగ్‌ మొదలు పెట్టారు. ఇసుక వ్యాపారులతో కొందరు అధికారులు కూడా కుమ్మక్కవ డంతో దోపిడీ యథేచ్ఛగా జరిగిపోతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లాలో 38 ఇసుక ర్యాంపులు ఉన్నాయి. వీటిలో కేవలం 15 ర్యాంపులు మాత్రమే బాగా పనిచేస్తున్నాయి. మరో మూడు ర్యాంపులు శుక్ర వారం నుంచి పనిచేయనున్నాయి. జిల్లాలో ఇసుక వ్యవ హారాలు చూసే ఒక అధికారికి సీసీలుగా పనిచేస్తున్న వారు ఇష్టానుసారం వ్యవహరిస్తూ, తమకు అనుకూల మైనవారికే ఆర్డర్లు ఇస్తున్నారని, ఆన్‌లైన్‌లో కేవలం కొన్ని ర్యాంపులు మాత్రమే ఉండేలా చూస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వారికి అనుకూలమైన వారికే డోర్‌ డెలివరీ పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో  ఇసుక బుక్‌ చేసుకున్న వినియోగదారుడు తన దగ్గర ప్రాంతం నుంచి, లేదా తనకు నచ్చిన ర్యాంపు నుంచి ఇసుక తెచ్చుకునే వీలులేకుండాపోతోంది. ఇలా చేయడం వల్ల కొన్ని ర్యాంపులలో ఇసుక కదలడంలేదు.

పాత బిల్లులతో అక్రమాలు

జిల్లాలోని అనేక ర్యాంపుల్లో అనధికారికంగా వందలాది లారీల ఇసుక తరలి పోతోంది. గతంలో ఇచ్చిన బిల్లులపై ఉండే హలోగ్రామ్‌ స్టిక్కర్‌ను తొలగించి, వేరే బిల్లులు  అతికి, వాటికి అనుమతి  ఉన్నట్టుగా ఇసుకను తరలిస్తున్నారు. ఇటీవల స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కొన్ని లారీలను కూడా పట్టుకోవడం గమ నార్హం. అయినా దోపిడీ ఆగడం లేదు. ముఖ్యంగా సీతానగరం మండలంలోనూ, జొన్నాడ ప్రాంతంలో దోపిడీ అధికంగా జరుగుతున్నట్టు సమాచారం. విశాఖకు కూడా అధికంగా తరలిపోతున్నట్టు తెలిసిందే. లారీ ఇసుక అక్కడకు రూ.70 వేల వరకూ విక్రయిస్తున్నారు. సీతానగరంలోని కాటవరం, ములక్లంకలోని ఒక ర్యాంపు నుంచి ఇలా తరలిస్తున్నట్టు సమాచారం.

కోనసీమలో ట్రాక్టర్‌ ఇసుక రూ.2 వేలు

కోనసీమలో పలుచోట్ల రాత్రి 12 గంటల నుంచి తెల్లవారేవరకు అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఇక్కడ ట్రాక్టర్‌ ఇసుకను రూ.2 వేలకు విక్రయి స్తున్నారు. రోజుకు ఒక్కో ర్యాంపు నుంచి 50 నుంచి 100 ట్రాక్టర్ల వరకూ ఇసుక అమ్మకాలు జరుగుతుండడం గమనార్హం.

సీసీల దందా

జిల్లా స్థాయి ఇసుక కమిటీ అనుమతితోనే ఇసుక తవ్వకాలకు అధికారికంగా  అనుమతి ఉంది.  దీనిని ఆసరా తీసుకుని, జిల్లా కమిటీ అధికారికి సంబంధించిన సీసీలు, కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి, తమకు కావలసిన వారి నుంచే ఇసుక వెళ్లేవిధంగా సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డోర్‌ డెలివరీకి బుక్‌ చేసుకుంటే, వారికి కేవలం కొన్ని ర్యాంపుల నుంచే అనుమతి ఇస్తున్నారు. బల్క్‌ ఆర్డర్లు పెండింగ్‌లో పెడుతూ టన్నుకు రూ.50 వంతున మామూలు తీసుకుంటు న్నారనే విమర్శలు ఉన్నాయి. ఉన్న ర్యాంపుల నుంచి ఇసుక సరఫరా సక్రమంగా జరగకుండా వీరు ఇలా వ్యహరిస్తుంటే, మరోపక్కన కొందరు ఇష్టానుసారం ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు.

Updated Date - 2021-03-05T06:56:33+05:30 IST