Abn logo
Aug 4 2020 @ 04:51AM

అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీ పట్టివేత

తాండూర్‌(బెల్లంపల్లి), ఆగస్టు 3: అనుమతులు లేకుండా కాగజ్‌నగర్‌ నుంచి తాండూర్‌కు  ఇసుక రవాణా చేస్తున్న లారీని ఆదివారం రాత్రి పట్టుకున్నట్లు తాండూర్‌ ఎస్సై శేఖర్‌ రెడ్డి తెలిపారు. ఆదివారం రాత్రి వాహనాలు తనిఖీ చేస్తుండగా కాగజ్‌నగర్‌ నుంచి మండలం లోని కిష్టంపేట గ్రామానికి ఇసుకతో వస్తున్న లారీని ఆపి రశీదులు చూపించాలని కోరామని చెప్పారు. సరైనవి లేకపోవడంతో లారీని స్వాధీనం చేసుకున్నామన్నారు. తిర్యాణి గ్రామానికి చెందిన లారీ యాజమాని మధుకర్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. 

Advertisement
Advertisement