ఇసుక రీచ్‌లను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించే విధంగా చర్యలు..

ABN , First Publish Date - 2021-04-13T06:01:14+05:30 IST

జిల్లాలో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించిన ప్రైవేటు ఏజెన్సీలకు బదలాయించే ఏర్పాట్లు చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు.

ఇసుక రీచ్‌లను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించే విధంగా చర్యలు..

 జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ),ఏప్రిల్‌ 12: జిల్లాలో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించిన ప్రైవేటు ఏజెన్సీలకు బదలాయించే ఏర్పాట్లు చేస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ జి. లక్ష్మీశ తెలిపారు. ఇసుక రీచ్‌లను ప్రైవేట్‌ ఏజెన్సీలకు బదలాయింపుపై తీసుకున్న చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది సోమవారం జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టరేట్‌ నుంచి మైనింగ్‌ డీడీ డీడీఆర్‌ కుమార్‌, డిస్ట్రిక్ట్‌ సాండ్‌ ఆఫీసర్‌ రవిలతో కలిసి జేసీ లక్ష్మీశ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రస్తుతం జిల్లాలో నిర్వహిస్తున్న రీచ్‌లను ప్రైవేట్‌ ఏజెన్సీలకు అప్పగించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రిన్సిపల్‌ సెక్రటరీకి వివరించారు. 

Updated Date - 2021-04-13T06:01:14+05:30 IST