ఆంక్షలు పొడిగింపు

ABN , First Publish Date - 2022-05-29T06:57:58+05:30 IST

కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ ఈనెల 24న అమలాపురంలో చేపట్టిన ఆందోళనలో అల్లర్లు, విధ్వంసకర సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలను మరి కొంతకాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఆంక్షలు పొడిగింపు
మీడియాతో మాట్లాడుతున్న రేంజి డీఐజీ పాల్‌రాజు. పక్కన ఎస్పీలు, ఏఎస్పీలు

 మరో వారంరోజులపాటు 144 సెక్షన్‌ అమలు

  నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు

 ఇంకో 24 గంటలు ఇంటర్నెట్‌ సేవలు బంద్‌

 విధ్వంసకర కేసుల్లో మరో 25 మంది నిందితుల అరెస్టు 

 ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 44 మంది 

 నిందితులపై పీడీపీపీ యాక్టు : డీఐజీ పాల్‌రాజు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కోనసీమ జిల్లా పేరు మార్చొద్దంటూ ఈనెల 24న అమలాపురంలో చేపట్టిన ఆందోళనలో అల్లర్లు, విధ్వంసకర సంఘటనల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలను మరి కొంతకాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ వివిధ కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టులు చేస్తున్న దృష్ట్యా ఎటువంటి అలజడులు లేకుండా ఉండేందుకు ఈ ఆంక్షలను పొడిగించారు. మరో వారం రోజులపాటు 144 సెక్షన్‌ పొడిగిస్తున్నట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పాల్‌రాజు విలేకరులకు తెలిపారు. రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం సాయంత్రంతో ఇంటర్నెట్‌ బంద్‌ గడువు ముగియనుంది. అయితే మరో 24 గంటల పాటు ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోతాయని డీఐజీ ప్రకటించారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం ఇంటర్నెట్‌ పునరుద్ధరణ చేసే అవకాశాలున్నాయి. అమలాపురం కలెక్టరేట్‌, ఎర్రవంతెన వద్ద బస్సు దహనాలు, వజ్ర వాహనంపై దాడి, రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌కు చెందిన క్యాంపు కార్యాలయం దహనానికి సంబంధించి శనివారం మరో 25 మంది నిందితులను అరెస్టు చేసినట్టు డీఐజీ వెల్లడించారు. వీరంతా అమలాపురం, అమలాపురం రూరల్‌, అల్లవరం, అయినవిల్లి మండలాల్లోని పరిసర గ్రామాలకు చెందినవారని చెప్పారు. ఆది వారం ఈ కేసులకు సంబంధించి మరికొన్ని అరెస్టులు కొనసాగుతాయన్నారు. కాగా ప్రస్తుతం నిందితులను గుర్తిం చేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వీడియో క్లిప్పింగ్‌లు, ఫొటో ఇమేజెస్‌,  వాట్సాప్‌ గ్రూపుల్లో యాక్టివ్‌గా ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై కేసులను బనాయిస్తున్నారు. సంఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్నా లేకపోయినా వారిని మాత్రం ఈ కేసుల్లో నిందితులకు చేరుస్తున్నారు. ర్యాలీకి పిలుపు నిచ్చి దూరంగా ఉన్న సాధన సమితి నాయకులతోపాటు పోలీసుల అదుపులో ఉన్న వారిపై కూడా కేసుల్లో నింది తులుగా ఉంటారని డీఐజీ పాల్‌రాజు విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా ఇంటర్నెట్‌ సేవల కోసం ప్రజలు నానాపాట్లు పడుతున్నారు. నెట్‌ ఆధారితమైన ఏ పనీ ముందుకు సాగడం లేదు. వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటివి నిలిపివేసి కనీసం మిగిలిన సేవలకైనా అనుమతివ్వాలని ప్రజలు కోరుతున్నారు.

నిందితుల నుంచి ఆస్తినష్టం రికవరీ

అమలాపురం అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై పీడీపీపీ యాక్టును పెట్టారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ డామేజ్‌ పబ్లిక్‌ ప్రాపర్టీ(పీడీపీపీ)  యాక్టును ఉపయోగించడం ద్వారా ఆస్తుల విధ్వంసాలకు సంబంధించిన నష్టాలను నిందితుల నుంచి రికవరీ చేస్తారు. ప్రధానంగా  ఈనెల 24 జరిగిన అల్లర్లలో బస్సులు, మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లు దహనం, వారి  ఆస్తుల విధ్వంసానికి సంబంధించిన నష్టాల అంచనాలను మదింపు చేస్తారు. కలెక్టర్‌ పర్యవేక్షణలో ఆర్‌అండ్‌బీ ఇంజనీరింగ్‌ అధికారులను ఈ నష్టాలను అంచనా వేస్తారు. ఆస్తుల విధ్వంసానికి సంబంధించి కేసుల్లో భాగస్వాములైన నిందితులకు చెందిన ఆస్తులను అధికారులు సీజ్‌ చేసి కోర్టుకు నివేదిక ఇస్తారు. కేసు విచారణ ముగిసి నేరారోపణ రుజువైతే సంబంధిత వ్యక్తుల నుంచి ఆ మొత్తం నష్టపరిహారాన్ని రికవరీ చేసేందుకు పీడీపీపీ యాక్టును నిందితులపై కేసుల్లో ప్రయోగించినట్టు డీఐజీ పాల్‌రాజు తెలిపారు. దాంతో కేసుల్లో అరెస్టవుతున్న నిందితుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. 

అరెస్టయిన వారి వివరాలు ఇవీ..

అమలాపురం, మే 28 (ఆంధ్రజ్యోతి): అమలాపురంలో జరి గిన అల్లర్లు, విధ్వంసకర సంఘటనలకు సంబంధించి మరో 25 మంది నిందితులను శనివారం అరెస్టు చేసినట్టు ఏలూరు రేంజ్‌ డీఐజీ పాల్‌రాజు వెల్లడించారు. అమలాపురంలోని ఎస్పీ కార్యా లయంలో శనివారం సాయంత్రం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో కోనసీమ ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి, కాకినాడ ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌బాబు, ఏఎస్పీలు మాధవీలత, చక్రవర్తిలు పాల్గొన్నారు. బస్సుల దహ నం, వజ్ర వాహనంపై దాడి, మంత్రి పినిపే విశ్వరూప్‌ క్యాంపు కార్యాలయం దహనం కేసుల్లో అమలాపురం పరిసర మండలా లకు చెందిన 25 మంది నిందితులను గుర్తించి అరెస్టు చేశామని చెప్పారు. ఆందోళనలో పాల్గొన్న సహ నిందితులు ఇచ్చిన సమా చారం, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ పార్టులో ఉన్న కొందరిని నిందితులుగా గుర్తిస్తున్నామన్నారు. ఇప్పటివరకు ఈ కేసులకు సంబంధించి 44 మందిని అరెస్టు చేశారు. ఆశెట్టి నాగవీర వెంక ట సాయిచంద్ర(23) నల్లావీధి, అమలాపురం. కుంచాల ప్రభు దేవ్‌ అలియాస్‌ పల్లా ప్రభుదేవ్‌(26) మార్కెట్‌ వీధి, అమలా పురం. రాచకొండ శివకుమార్‌(27) అమలాపురం. సుందరనీడి సాదుబాబాజీ (39) ఈదరపల్లి. అరిగెల వినయ్‌ (21) మార్కె ట్‌వీధి. అప్పలనాగరాజ్‌రంగబాబు అలియాస్‌ పవన్‌(33) గాంధీ నగర్‌. పాలా అజయ్‌రెడ్డి(21) శ్రీరామపురం. పడుచూరి బ్రహ్మా నందం(18) ఎ.వేమవరప్పాడు. యల్లమిల్లి ధర్మేంద్రస్వామి (25) ఏ.వేమవరప్పాడు. బండారు భాస్కరసత్యరాజేష్‌ (21) మాచ వరం, అంబాజీపేట. పెచ్చెట్టి దుర్గావెంకటగణేష్‌ (27) అంబా జీపేట. పెచ్చెట్టి తులసీదుర్గాప్రసాద్‌(30) అంబాజీపేట. భీమాల దుర్గాసాయి(24) గంగలకుర్రు. మట్టపర్తి వెంకటచరణ్‌ (22) అంబాజీపేట. గొండ్రాతి చంద్రమౌళి(26) అల్లవరం. శీలం బాల విజయకుమార్‌ అలియాస్‌ బాల(31) కోడూరుపాడు. సంగాడి ఆనంద్‌బాబు(29) గోడితిప్ప. పితాని దుర్గాప్రసాద్‌(24) అల్లవ రం. వాసంశెట్టి వీరవెంకటదుర్గారావు(29) అల్లవరం. వాసంశెట్టి తాతాజీ (27) కోడూరుపాడు. వాసంశెట్టి జయరామ కృష్ణ(25) కోడూరుపాడు. గుత్తుల సాయినాగేంద్ర(25) నేదునూరు. కొప్పి శెట్టి దుర్గారామప్రసాద్‌(26) విలస, దూనబోయిన గణేష్‌(18) ముక్తేశ్వరం. వాసంశెట్టి శ్రీనివాసరావు (30) చినగాడవిల్లి.




Updated Date - 2022-05-29T06:57:58+05:30 IST