బాబాయ్.. మోతీమహల్ సంగతేంటి..?: సంచయిత గజపతి

ABN , First Publish Date - 2020-05-24T00:49:19+05:30 IST

విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం తొలగింపుపై దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతి రాజు కావాలనే తప్పుడు

బాబాయ్.. మోతీమహల్ సంగతేంటి..?: సంచయిత గజపతి

విశాఖపట్నం: విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం తొలగింపుపై దేవస్థానం చైర్‌పర్సన్ సంచయిత గజపతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతి రాజు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం అక్కడ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని తిరిగి ప్రతిష్టిస్తారని ఆమె వెల్లడించారు. మాన్సాస్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు ఉన్నసమయంలో.. విజయనగరం చరిత్ర, సంస్కృతికి ప్రతీక అయిన 1869 నాటి మోతీమహల్‌ను పునరుద్ధరించకుండా ఎందుకు ధ్వంసం చేశారని ఆమె ప్రశ్నించారు. తన బాబాయ్ అశోక్ గజపతి రాజు, చంద్రబాబు దీనిపై వివరణ ఇవ్వగలరా? అని సంచయిత ప్రశ్నించారు. తాతగారైన పీవీజీ రాజుగారి వారసత్వాన్ని ఎందుకు కాపాడలేకపోయారని ఆమె నిలదీశారు.



Updated Date - 2020-05-24T00:49:19+05:30 IST