గ్రానైట్‌ వ్యర్థాలకు అడ్డాగా సనకొండ

ABN , First Publish Date - 2022-05-16T05:13:01+05:30 IST

గ్రానైట్‌ ఫ్యాక్టరీల వ్యర్థాలకు అడ్డాగా ప్రభుత్వ, రైతుల భూములు మారాయి.

గ్రానైట్‌ వ్యర్థాలకు అడ్డాగా సనకొండ
రైతులకు చెందిన భూమిలో పడవేసి వెళ్లిన గ్రానైట్‌ వ్యర్థాలు

 రోడ్ల వెంబడి తెల్లటి దువ్వ, బండరాళ్లు

డంపింగ్‌ యార్డుని తలపిస్తున్న పంట పొలాలు

ఇబ్బందులు పడుతున్న రైతులు

పట్టించుకోని అధికారులు

బల్లికురవ, మే 15: గ్రానైట్‌ ఫ్యాక్టరీల వ్యర్థాలకు అడ్డాగా ప్రభుత్వ, రైతుల భూములు మారాయి. రా త్రుళ్లు ఇష్టారాజ్యంగా కొందరు తమకు పనికిరాని బం డరాళ్లను, తెల్లటి డస్టును తీసుకొచ్చి వదిలివెళుతున్నా రు. దీంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు పేర్కొంటున్నారు. వ్యర్థాల ప్రభావంతో పంట లు కూడా సరిగా పండటం లేదని  తెలిపారు. డం పింగ్‌ యార్డును తలపించేలా కొండ ప్రాంతం మారిం దని వారు ఆందోళన చెందుతున్నారు. 

బల్లికురవ మండల పరిధిలో ఉన్న సనకొండ ప్రాం తం డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. కొంతకాలం నుంచి బల్లికురవ, మార్టురు మండలాల పరిధిలో ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులు తమకు పనికి రాని వ్యర్థ రాళ్లను ట్రాక్టర్లలో తీసుకు వచ్చి కొండ భూ ములలో పడవేస్తున్నారు. రాత్రుళ్లు అయితే ఎక్కడప డితే అక్కడ అన్‌లోడ్‌ చేసి వెళుతున్నారు. రైతుల ప ట్టా భూములలో కూడా రాళ్లు వేయటంతో వాటిని తీ సే వీలులేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీ వల ఎస్‌సీ రైతులు తమ భూములలో వ్యర్థాలు పడ వేస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్‌ఐ కొండప్రాంతాన్ని పరిశీలించి హెచ్చరిక లు చేశారు. అయినప్పటికీ కొందరు వ్యర్థాలను పడ వేసి వెళుతున్నారు.

బల్లికురవకు చెందిన ఎస్‌సీ రైతు జొన్నలగడ్డ ఆది య్య పంట భూమిలో వ్యర్థ రాళ్లు రోజురోజుకి పెరిగి పోతున్నాయి. ఎవరు వాటని వేస్తున్నారో కూడా తమ కు అర్థం కావటం లేదని అవేదన వ్యక్తం చేశారు. మా ర్టూరు మండలం నాగరాజుపల్లి, వేమవరం ప్రాంతాల నుంచి వ్యర్థాలను తీసుకువచ్చి ఇక్కడ వదిలే స్తున్నారని రైతులు తెలిపారు. పంట పొలాలకు వె ళ్లాలన్న తెల్లటి దువ్వతో తాము తీవ్ర అవస్థలు పడు తున్నామని,  వాహనాలకు కూడా అందులో కదలటం లేదని వారు తెలిపారు. ప్రభుత్వ భూములు కావటం తో ఎవరుపడితే వారు వ్యర్థాలను పడవేస్తున్నారు. మునుముందు బండరాళ్లతో ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చర్చి సమీపంలోనూ వ్యర్థాలు పడవేస్తుండటంతో ఇ బ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ అధికారులు కూ డా వ్యర్థా గురించి పట్టించుకోవటం లేదని  స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే కొండ ప్రాంతాన్ని పరిశీలించి వ్యర్థాలను తొలగించే చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.


 వ్యర్థాలను రాత్రుళ్లు పడవేసి వెళుతున్నారు

జొన్నలగడ్డ అదియ్య, రైతు, బల్లికురవ

సనకొండ ప్రాంతంలో ఉన్న తన పట్టా భూమిలో కొందరు గ్రానైట్‌ వ్యర్థాలను రాత్రుళ్లు పడవేసి వెళుతున్నారు. ఇలా అయితే కొన్ని రోజులలోనే తన భూమి డంపింగ్‌ యార్డుగా మారే అవకాశం ఉంది. చూట్టుపక్కల ఉన్న గ్రానైట్‌ ఫ్యాక్టరీల యజమానులకు చెప్పినా తమకు సంబంధం లేదంటున్నారు. ఈ వ్యర్థాలను వేయక పోతే రాళ్లు ఎలా వచ్చాయి. అధికారులు వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలి


సనకొండకు వెళ్లాలంటే భయమేస్తుంది

 జొన్నలగడ్డ బుల్లియ్య, బల్లికురవ

సనకొండ ప్రాంతానికి వెళ్లాలంటేనే భయమేస్తుంది. మట్టి రోడ్డు వెంబడి వ్యర్థాలు పెద్ద ఎత్తున పడవేశారు. ఆ రాళ్లు ఎక్కడ జారి రోడ్డు మీదకు వస్తాయోనని తా ము అటువైపు వెళ్లటం మానివేశాం రోడ్డు తెల్లటి దు వ్వ వదిలివేశారు. అ దువ్వతో బైకులు కూడా జారి పొతున్నాయి. వ్యర్థాలను వేస్తున్న వారిపై చర్యలు చేపట్టాలి


చర్చి పక్కనా  వ్యర్థాలు వేస్తున్నారు..

 పందిరి అంజిబాబు, సర్పంచ్‌,  బల్లికురవ

కొండ ప్రాంతం కావటంతో అడ్డు చెప్పేవారు లేక గ్రానైట్‌ ఫ్యాక్టరీల వ్యర్థాలను తీసుకు వచ్చి వదిలి వెళుతున్నారు. కొండ సమీపంలోనే చర్చి ఉన్న అక్కడ కూడా వ్యర్థాలు వేశారు. ప్రభుత్వ భూములలో రోజురోజుకి వ్యర్థాలు పెరిగిపొతున్నాయి. ఇలాగాఉంటే త్వరలో డంపింగ్‌ యార్డులా కొండ భూమి మారుతుంది. అఽధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి.

Updated Date - 2022-05-16T05:13:01+05:30 IST