Monkeypox: మంకీపాక్స్‌ను స్థానిక ఎమర్జెన్సీగా ప్రకటించిన అమెరికా నగరం..

ABN , First Publish Date - 2022-07-30T03:27:03+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరల్ వ్యాధిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Monkeypox: మంకీపాక్స్‌ను స్థానిక ఎమర్జెన్సీగా ప్రకటించిన అమెరికా నగరం..

ఎన్నారై డెస్క్: ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్(Monkey pox) పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరల్ వ్యాధిని హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్‌ఫ్రాన్‌సిస్కో(Sanfrancisco) నగరం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. మంకీపాక్స్ వ్యాధిని స్థానిక ఎమర్జెన్సీగా(Local Emergency) ప్రకటించింది. మంకీపాక్స్ నిరోధక చర్యలను మరింత వేగవంతం చేసేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని నగర ప్రజారోగ్య శాఖ అధికారులు తెలిపారు. అయితే..ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి అమెరికా నగరం శాన్‌ఫ్రాన్‌సిస్కో కావడం గమనార్హం. ముందుస్తు చర్యల ద్వారా ప్రజారోగ్యాన్ని పరిరక్షించగలమన్న విషయం కరోనా సంక్షోభం మనకు నేర్పించిందని నగర మేయర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. నగరంలో 261 మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. ఇక రాష్ట్రమంతటా 799 కేసులు ఉన్నట్టు సమాచారం. మరోవైపు.. మంకీపాక్స్‌ను ఎదుర్కొనే 35 వేల వ్యాక్సిన్ డోసులు  కావాలని అధికారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయితే.. ఇప్పటివరకూ 12 వేల డోసులే అందినట్టు స్థానిక మీడియా చెబుతోంది. 

Updated Date - 2022-07-30T03:27:03+05:30 IST