Abn logo
Apr 3 2020 @ 15:59PM

నెటిజన్ అసభ్యకర ప్రశ్న.. హీరోయిన్ ఘాటు రిప్లై!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సామాన్యులకు, సెలబ్రిటీలకు మధ్య దూరం తగ్గింది. సినీ ప్రముఖులు నేరుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మాట్లాడుతున్నారు. వారి ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నారు. అయితే కొందరు నెటిజన్ల ప్రవర్తన మాత్రం సెలబ్రిటీలకు తలనొప్పులు తెస్తోంది.


తాజాగా మలయాళీ హీరోయిన్ సంయుక్త మీనన్‌కు ఓ నెటిజన్ ప్రశ్న చిరాకు తెప్పించింది. దీంతో ఘాటుగా రిప్లై ఇచ్చింది. `నువ్వు వర్జిన్‌వేనా?` అంటూ ఓ నెటిజన్ ట్విటర్ వేదికగా సంయుక్తను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సంయుక్త ఫైర్ అయింది. `నీలాంటి వాళ్లకు అమ్మాయిలు ఆటబొమ్మల్లా కనిపిస్తుంటారు. మీలాంటి వాళ్లు ఎప్పుడూ సెక్స్, ఆల్కహాల్ గురించే ఆలోచిస్తారు. మీలాంటి వాళ్లు ఈ సమాజానికి చాలా ప్రమాదకరం. జాగ్రత్తగా ఉండు.. నీ చెంప పగలగొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంద`ని సంయుక్త ఫైర్ అయింది.  

Advertisement
Advertisement
Advertisement