Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 29 2021 @ 17:49PM

సెప్టెంబరు 25న భారత్ బంద్!

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) వచ్చే నెల (సెప్టెంబరు) 25న భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆందోళనలు పదో నెలకు చేరుకోనున్న నేపథ్యంలో ఆదివారం ఈ పిలుపునిచ్చింది. హర్యానాలోని నూహ్‌లో నిర్వహించిన కిసాన్ మహాసభలో ఎస్‌కేఎం నేత దర్శన్ పాల్ సింగ్ మాట్లాడుతూ.. ఢిల్లీ రోడ్లను దిగ్బంధించేందుకు దక్షిణ హర్యానా-మేవాట్ రైతులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 


ఢిల్లీ మొత్తాన్ని దిగ్బంధించేందుకు సిద్ధంగా ఉండాలని, ఈ మేరకు ఎస్‌కేఎం త్వరలోనే పిలుపునిస్తుందని దర్శన్‌పాల్ సింగ్ పేర్కొన్నారు. సెప్టెంబరు 5న ముజఫర్‌నగర్ మహాపంచాయత్‌లో ‘మిషన్ యూపీ’ని ప్రకటిస్తామన్నారు. అలాగే, ప్రతి తహశీల్‌, గ్రామంలోనూ ఎస్‌కేఎం యూనిట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతు నేత యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. సెప్టెంబరు 5 నాటి ముజఫర్‌నగర్ మహాపంచాయత్ దేశంలోని రైతులందరికీ పరీక్షలాంటిదన్నారు. మేవాట్ రైతులు ఉత్తరప్రదేశ్ చేరుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు.   

Advertisement
Advertisement