Aug 7 2021 @ 19:44PM

టాలీవుడ్‌లోకి మరో మలయాళ బ్యూటీ!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్స్ కంటే పర భాషా హీరోయిన్స్‌కే అవ‌కాశాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఇటు కోలీవుడ్‌, మల్లువుడ్‌తో పాటు అటు బాలీవుడ్ నుంచి హీరోయిన్స్ టాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఈ వ‌రుస‌లో మ‌రో మ‌ల‌యాళ బ్యూటీ చేర‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఆమె ఎవ‌రో తెలుసా? సంయుక్త మీన‌న్‌. మ‌ల‌యాళ‌, త‌మిళ సినిమాల్లో న‌టించిన ఈ అమ్మ‌డు ఇప్పటికే తెలుగులో క‌ళ్యాణ్ రామ్‌తో ఓ సినిమా చేస్తుంది. ఈ సినిమా పూర్తి కాక ముందే సాయితేజ్ సినిమాకు సైన్ చేసింద‌ట‌. సుకుమార్ రైటింగ్స్‌, బివిఎస్ఎన్ ప్ర‌సాద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మ‌రి ఈమె ఇప్ప‌టికే రేసులో ఉన్న ఇత‌ర హీరోయిన్స్‌కు ఎలాంటి పోటీనిస్తుందో చూడాలి మ‌రి.