Chitrajyothy Logo
Advertisement
Published: Wed, 10 Aug 2022 19:58:14 IST

Samuthirakani: ఆయన కళ్ళల్లో చూసి కోపంగా డైలాగ్ చెప్పలేకపోయేవాడిని!

twitter-iconwatsapp-iconfb-icon

నితిన్ (Nithiin) హీరోగా తెరకెక్కిన మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ (Macherla Niyojakavargam). ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో.. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మించారు. కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అంజలి ఓ స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచాయి. ఆగస్టు 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలవుతున్న సందర్భంగా.. చిత్రంలో విలన్‌గా రాజప్ప పాత్రలో నటించిన సముద్రఖని (Samuthirakani) మీడియాతో ముచ్చటించారు. ఈ మీడియా సమావేశంలో సముద్రఖని చెప్పిన ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్ర విశేషాలివే..


తెలుగులో మీ ప్రయాణం ఎలా సాగుతోంది?

తెలుగులో నా ప్రయాణం అద్భుతంగా ఉంది. తివిక్రమ్‌గారు ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో ఓ గిఫ్ట్ ఇచ్చారు. ఆ తర్వాత ‘క్రాక్, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారిపాట’.. ఇలాంటి మంచి చిత్రాలు చేసే అవకాశం దొరికింది. త్రివిక్రమ్, రాజమౌళి, గోపిచంద్ మలినేని, పరశురాం వంటి అద్భుతమైన దర్శకులతో కలసి పని చేసే అవకాశం దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా.  


‘మాచర్ల నియోజకవర్గం’ ప్రయాణం గురించి..?

గత ఏడాది దర్శకుడు రాజశేఖర్‌గారు మాచర్ల కథ చెప్పారు. చాలా నచ్చింది. తమిళనాడులోని ఓ ప్రాంతంలో ఇలాంటి సంఘటన జరిగింది. ఇరవై ఐదేళ్ళుగా అక్కడ ఎలక్షన్ జరగలేదు. చివరికి ఉదయ్ చందర్ అనే ఒక ఐఎఎస్ అధికారి చొరవ తీసుకొని అక్కడ స్థానికులతో మాట్లాడి పరిస్థితులని చక్కదిద్ది ఎన్నికలు జరిపారు. దర్శకుడు శేఖర్‌తో కూడా అదే సంగతి చెప్పా. చాలా అద్భుతమైన కథ. తప్పకుండా చేస్తానని చెప్పా. ఇందులో నా పాత్రలో ఒక సర్‌ప్రైజ్ వుంది. అది థియేటర్లో చూడాల్సిందే.

Samuthirakani: ఆయన కళ్ళల్లో చూసి కోపంగా డైలాగ్ చెప్పలేకపోయేవాడిని!

‘రాజప్ప’ పాత్ర మీకెలా అనిపించింది?

రాజప్ప పాత్రలో చాలా డెప్త్ వుంది. అలాంటి పాత్రలు నిజ జీవితంలో కూడా చూశాను. నేను పుస్తకాలు బాగా చదువుతాను. అలా చదివినప్పుడు ఏదో ఒక చోట రిఫరెన్స్ దొరుకుతుంది. రాజప్ప (Rajappa) పాత్రలో సినిమా అంతా పవర్ ఫుల్ ఎమోషన్ క్యారీ చేస్తా. నటనకు ఆస్కారం వుండే అద్భుతమైన పాత్ర. నితిన్‌గారు అద్భుతమైన వ్యక్తి. ఆయన చాలా ఎనర్జిటిక్. ఆయన కళ్ళల్లో చూసి కోపంగా డైలాగ్ చెప్పలేకపోయేవాడిని (నవ్వుతూ). ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని జ్ఞాపకం. (Samuthirakani Interview)


నిర్మాతల గురించి?

నిర్మాత సుధాకర్‌గారు సెట్స్‌లో ఉంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ప్రతీది చాలా కంఫర్ట్‌బుల్‌గా చూసుకున్నారు. ఈ చిత్రంలో మంచి టెక్నిషియన్స్ పని చేశారు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు అద్భుతమైన కథతో వస్తున్న చిత్రమిది. ఫ్యామిలీ, కామెడీ, లవ్ స్టోరీ.. ఇలా అన్ని ఎలిమెంట్స్ వున్న ప్యాకేజీ ఇది. సినిమాపై పాజిటివ్ వైబ్ వుంది. ఖచ్చితంగా సినిమా విజయం సాధిస్తుంది.


నటుడిగా ఈ చిత్రం ఎంత తృప్తినిచ్చింది?

రాజప్ప పాత్రలో ఒక ఛాలెంజ్  వుంది. చాలా కష్టపడి చేశాను. అయితే స్క్రీన్‌పై చూసుకునే సరికి కష్టం అంతా మరిచిపోయాను. సినిమా అద్భుతంగా వచ్చింది. ఒక నటుడిగా వందశాతం తృప్తిని ఇచ్చింది. కృతిశెట్టి తో పాటు చాలా మంది నటీనటులు అద్భుతంగా నటించారు.


నితిన్ ఫెర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది?

మాచర్లలో నితిన్ ఫెర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వుంటుంది. కొత్త నితిన్‌ని చూస్తారు. నితిన్ నుండి ఒక కొత్త విశ్వరూపం బయటికి వస్తుంది. మా ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వుంటాయి.


దర్శకుడు శేఖర్ గురించి?

చాలా బాగా డైరెక్ట్ చేశారు. అతను ఎడిటర్ కాబట్టి ఎంత కావాలో, ఎంత తీయాలో ఫుల్ క్లారిటీతో ఈ సినిమాని తీశారు.

Samuthirakani: ఆయన కళ్ళల్లో చూసి కోపంగా డైలాగ్ చెప్పలేకపోయేవాడిని!

మీ దర్శకత్వంలో నితిన్ సినిమా చేస్తానని చెప్పారు కదా?

మా సినిమా కచ్చితంగా వుంటుంది. రెండేళ్ళ క్రితమే మాట్లాడుకున్నాం. సరైన సమయం వచ్చినపుడు మా సినిమా ఖచ్చితంగా జరుగుతుంది. (Samuthirakani Interview)


గత వారం రెండు విజయాలు వచ్చాయి.. ఈ వారం మాచర్ల ఆ విజయాన్ని కొనసాగిస్తుందా?

మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు కచ్చితంగా చూస్తారు. ‘సీతారామం, బింబిసార’ రెండు సినిమాలు చూశాను. , బింబిసార మాస్ అయితే, సీతారామం క్లాస్ ఎక్స్ ట్రార్డినరీ. మాచర్ల నియోజికవర్గం ఈ సక్సెస్‌ని తప్పకుండా కొనసాగిస్తుంది. సినిమాని సిన్సియర్‌గా చేశాం. ప్రేక్షకులు థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నాను.


నటుడిగా, దర్శకుడిగా, రచయితగా.. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?

నాకు రచన అంటే ప్రాణం. షూటింగ్ గ్యాప్‌లో సమయం దొరికితే కారవాన్‌లో కూర్చుని రాసుకుంటా. రాసుకున్న కథలని బ్యాంక్ లాకర్‌లో పెట్టినట్లుగా దాచుకుంటా. నటుడిగా వున్నప్పుడు నా దృష్టి కేవలం నటనపైనే వుంటుంది.


ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?

చిరంజీవిగారి ‘గాడ్ ఫాదర్’, నానిగారి ‘దసరా’ సినిమాలు చేస్తున్నా.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement