సామూహిక ప్రార్థనలు నిషేధం

ABN , First Publish Date - 2021-05-06T05:45:44+05:30 IST

కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిషేఽధించినట్లు శిరివెళ్ల సర్కిల్‌ సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు.

సామూహిక ప్రార్థనలు నిషేధం

  1. సీఐ చంద్రబాబు నాయుడు 
  2. ముస్లిం మతపెద్దలతో సమావేశం


శిరివెళ్ల, మే 5: కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా మసీదుల్లో సామూహిక ప్రార్థనలు నిషేఽధించినట్లు శిరివెళ్ల సర్కిల్‌ సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. శిరివెళ్లలోని ముస్లిం మత పెద్దలతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బుధవారం సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి కర్ఫ్యూ అమలవుతుండడంతో పవిత్ర రంజాన్‌ మాసంలో ముస్లింలు పాటించాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ముస్లింలు మాస్క్‌ ధరించి భౌతిక దూరం పాటిస్తూ తమ నివాసాలకు అతి దగ్గరలోని మసీదుల్లో తక్కువ సంఖ్యలో హాజరై ప్రార్థనలు చేసుకోవాలన్నారు. రంజాన్‌ పండుగ రోజు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం ద్వారా వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ దూరం నుంచే శుభాకాంక్షలు తెలుపుకోవాలన్నారు. ఈసమావేశంలో ఎస్‌ఐ సూర్యమౌళి, సిబ్బంది శాఖమూరి కృష్ణ, కృష్ణమూర్తి, జంబులయ్య, శ్రీనివాసులు, రామమద్దిలేటి, నాగేష్‌, మద్దిలేటి, వెంకటప్పయ్య పాల్గొన్నారు. 


రుద్రవరం: రంజాన్‌ మాసంలో మసీదుల్లో భౌతికదూరం పాటిస్తూ మాస్క్‌ ధరించి ప్రార్థనలు చేయాలని శిరివెళ్ల సీఐ చంద్రబాబునాయుడు ముస్లిం మత పెద్దలకు సూచించారు. బుధవారం రుద్రవరం పోలీసు స్టేషన్‌ ఆవరణలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. మసీదుల్లో ప్రార్థనలు చేసుకోవడానికి 5 నుంచి 10 మందికి మాత్రమే అనుమతి ఉందని అన్నారు. పెళ్లికి 20 మందికే అనుమతి ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-06T05:45:44+05:30 IST