Abn logo
Sep 27 2020 @ 02:11AM

హ్యాపీ మొబైల్స్‌లో సామ్‌సంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 2

Kaakateeya

హైదరాబాద్‌: హ్యాపీ మొబైల్స్‌...తమ స్టోర్లలో సామ్‌సంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 2 ను అందుబాటులోకి తీసుకువచ్చింది. హ్యాపీ మొబైల్స్‌ సీఎండీ కృష్ణ పవన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సంతోష్‌ కోట ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న 70కి పైగా స్టోర్లలో గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌ 2 ప్రత్యేకంగా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని వారు వెల్లడించారు. కార్యకలాపాలు ప్రారంభించిన అనతి కాలంలో హ్యాపీ మొబైల్స్‌.. వినియోగదారుల మనసు చూరగొందని పేర్కొన్నారు. భారీ లక్ష్యాలతో రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్నామని, కొత్తగా 100 నుంచి 125 కొత్త షోరూమ్‌లను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. హ్యాపీ మొబైల్‌ జాతీయ స్థాయి బ్రాండ్‌గా ఎదుగుతుందన్న విశ్వాసం తమకుందన్నారు. 


ప్రత్యేక పథకాలు 

జూ రూ.12,499 నుంచి ఈఎంఐ ప్రారంభం 

జూ ఒక సంవత్సరం యాక్సిడెంటల్‌, లిక్విడ్‌ డామేజ్‌ ప్రొటెక్షన్‌

జూ 4 నెలల పాటు యూట్యూబ్‌ ప్రీమియం సబ్‌స్ర్కిప్షన్‌ ఉచితం

జూ మైక్రోసాఫ్ట్‌ ఎం365 ఫ్యామిలీ ప్యాక్‌పై 22 శాతం తగ్గింపు

జూ 12 నెలల నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం


Advertisement
Advertisement
Advertisement