rotating displayతో Samsung Galaxy వాచ్‌ల విడుదల

ABN , First Publish Date - 2021-08-12T02:32:09+05:30 IST

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

rotating displayతో Samsung Galaxy వాచ్‌ల విడుదల

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్‌తోపాటు కొత్త ఎక్సినోస్ డబ్ల్యూ920ఎస్‌వోసీ, వన్ యూఐ వాచ్‌ 3ను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 ప్రారంభ ధర రూ. 26,000, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్‌ వాచ్ రూ. 29,700 ఉంటుందని కంపెనీ తెలిపింది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 42ఎంఎం మరియు 46ఎంఎం సైజుల్లో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ రొటేటింగ్ డిస్‌ప్లేతో వస్తోందని కంపెనీ పేర్కొంది.


శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

గెలాక్సీ వాచ్ 4 అల్యూమినియం బిల్డ్‌లో వస్తోందని, 40ఎంఎం, 44ఎంఎం వెర్షన్‌లను కలిగి ఉంది. అయితే గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 42 ఎంఎం మరియు 46ఎంఎం స్టెయిన్లెస్ స్టీల్ బాడీని కలిగి ఉంది. రెండు స్మార్ట్ వాచ్‌ల కోసం విభిన్న రంగు ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 40ఎంఎం బ్లాక్, పింక్ గోల్డ్ మరియు సిల్వర్ రంగుల్లో లభిస్తుండగా, శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 44 ఎంఎం బ్లాక్, గ్రీన్ మరియు సిల్వర్ రంగుల్లో లభించనుంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 42ఎంఎం మరియు శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 46ఎంఎం రెండూ బ్లాక్ మరియు సిల్వర్ షేడ్స్‌లో లభిస్తాయని కంపెనీ వెల్లడించింది.


గెలాక్సీ వాచ్ 4 40ఎంఎం మరియు గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 42ఎంఎం 247ఎంఏహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. అయితే గెలాక్సీ వాచ్ 4 44ఎంఎం మరియు గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 46ఎంఎం 361ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. శాంసంగ్ గెలాక్సీ వాచ్ 4 40ఎంఎం 40.4ఎక్స్39.3ఎక్స్9.8ఎంఎం, గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 42ఎంఎం41.5ఎక్స్41.5ఎక్స్11.2ఎంఎం ఉంటుంది. గెలాక్సీ వాచ్ 4 44ఎంఎం, మరోవైపు 44.4ఎక్స్43.3ఎక్స్9.8ఎంఎం మరియు గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 46ఎంఎం 45.5ఎక్స్45.5ఎక్స్11ఎంఎం, గెలాక్సీ వాచ్ 4 40ఎంఎం బరువు 25.9 గ్రాములు, గెలాక్సీ వాచ్ 4 44ఎంఎం బరువు 30.3 గ్రాములు. గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ 42ఎంఎం బరువు 46.5 గ్రాములు, అయితే దాని 46ఎంఎం బరువు 52 గ్రాములు ఉంటుందని సంస్థ తెలిపింది.



Updated Date - 2021-08-12T02:32:09+05:30 IST