రెండు వేరియంట్లలో Samsung foldable స్మార్ట్‌ఫోన్స్..

ABN , First Publish Date - 2021-07-21T23:14:27+05:30 IST

రెండు వేరియంట్లలో Samsung foldable స్మార్ట్‌ఫోన్స్..

రెండు వేరియంట్లలో Samsung foldable స్మార్ట్‌ఫోన్స్..

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు శాంసంగ్ సంస్థ పేర్కొంది. అదిరిపోయే ఫీచర్లతో రెండు కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఆగస్టు 11న శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల ధర ఎంత ఉంటుందనేది కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఫోన్ల విడుదలకు ముందే వాటి ఫీచర్స్.. ధరలు లీకయ్యాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ఫోన్ రూ. 1,47,400 నుంచి రూ. 1,78,400, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 స్మార్ట్‌ఫోన్ రూ. 85,900 నుంచి రూ. 1,03,900  వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - 2021-07-21T23:14:27+05:30 IST