అతిపెద్ద బ్యాటరీ.. నాలుగు కెమెరాలు.. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ప్రత్యేకతలెన్నో..

ABN , First Publish Date - 2020-07-31T01:28:48+05:30 IST

శాంసంగ్ మరో నయా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ ఎం31ఎస్’ను

అతిపెద్ద బ్యాటరీ.. నాలుగు కెమెరాలు.. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ ప్రత్యేకతలెన్నో..

న్యూఢిల్లీ: శాంసంగ్ మరో నయా స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. గెలాక్సీ ఎం సిరీస్‌లో భాగంగా ‘గెలాక్సీ ఎం31ఎస్’ను విడుదల చేసింది. అతిపెద్ద బ్యాటరీ, రివర్స్ చార్జింగ్ సపోర్ట్, క్వాడ్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్‌మి నోట్ 9 ప్రో మ్యాక్స్, రియల్‌మి 6 ప్రొలకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 19,499 కాగా, 8జీబీ వేరియంట్ ధర రూ. 21,499. శాంసంగ్ షాప్, అమెజాన్ ఇండియా ద్వారా ఆగస్టు 6 నుంచి విక్రయానికి రానుంది.  


శాంసంగ్ గెలాక్సీ ఎం31ఎస్ స్పెసిఫికేషన్లు: 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ-ఒ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 10 ఓఎస్, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్, 6జీబీ, 8జీబీ ర్యామ్ వేరియంట్లు, 64 ఎంపీ ప్రధాన సెన్సార్‌తో వెనకవైపు నాలుగు కెమెరాలు, 32 ఎంపీ సెల్ఫీ షూటర్,  128 జీబీ ఆన్‌బోర్డ్ మెమొరీ, ఎస్‌డీ కార్డు ద్వారా మరింత పెంచుకునే వెసులుబాటు ఉన్న ఈ ఫోన్‌లో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. 

Updated Date - 2020-07-31T01:28:48+05:30 IST