గెలాక్సీ ఎ01, ఎం11 ధరలను తగ్గించిన శాంసంగ్

ABN , First Publish Date - 2020-09-29T00:33:33+05:30 IST

శాంసంగ్ అభిమానులకు ఇది శుభవార్తే. ఎం సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎం01, గెలాక్సీ ఎం11 ధరలను

గెలాక్సీ ఎ01, ఎం11 ధరలను తగ్గించిన శాంసంగ్

న్యూఢిల్లీ: శాంసంగ్ అభిమానులకు ఇది శుభవార్తే. ఎం సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు గెలాక్సీ ఎం01, గెలాక్సీ ఎం11 ధరలను తగ్గిస్తున్నట్టు శాంసంగ్ తెలిపింది. తాజా తగ్గింపుతో గెలాక్సీ ఎం01 ధర రూ. 8 వేలకు తగ్గింది. గెలాక్సీ ఎం01 3జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ. 8,399 కాగా, ఇప్పుడు దీని ధరను రూ. 7,999కి తగ్గించింది. 


శాంసంగ్ గెలాక్సీ ఎం11 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ ఆప్షన్ ధర రూ. 11,499 కాగా, ఇప్పుడు దీని ధరను రూ. 10,999కి తగ్గించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.12,999 నుంచి రూ. 11,999కి తగ్గింది. ఈ రెండింటిని ఈ ఏడాది జూన్‌లో లాంచ్ చేసింది. కాగా, ఈ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గడం ఇది రెండోసారి.   

Updated Date - 2020-09-29T00:33:33+05:30 IST