అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

ABN , First Publish Date - 2021-08-12T21:36:31+05:30 IST

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్‌లో సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది.

అదిరిపోయే ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్‌ విడుదల

న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. భారత మార్కెట్‌లో సరికొత్త ఫీచర్లతో శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు సంస్థ పేర్కొంది. శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 13,999 ఉంటుంది.


భారత మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్ల ధరలు..

4జీబీ ర్యామ్‌తోపాటు 64జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్ రూ. 13,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్ రూ. 16,499 ఉంటుందని సంస్థ వెల్లడించింది. శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో రూపొందించినట్లు సంస్థ తెలిపింది. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.


శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఇలా ఉన్నాయి..

శాంసంగ్ గెలాక్సీ ఏ12 ఫోన్ ఆండ్రాయిడ్ 11 వన్ యూఐ కోర్‌తో పని చేస్తోంది. 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డు, 1టీబీ, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, సెల్ఫీస్ అండ్ వీడియో కాల్స్, శాంసంగ్ గెలాక్సి ఏ12 స్పార్ట్స్ 8 మెగాపిక్సెల్ సెన్సార్, ఫ్రంట్ ఎఫ్/2.2 లెన్స్ ఉంటుందని కంపెనీ తెలిపింది.

Updated Date - 2021-08-12T21:36:31+05:30 IST