శాంసంగ్‌ బడ్స్‌తో ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌

ABN , First Publish Date - 2021-12-18T05:30:00+05:30 IST

శాంసంగ్‌ బడ్స్‌ ఇక ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌కీ ఉపయోగపడనుంది. ఇదే విషయాన్ని ‘లెట్స్‌గోడిజిటల్‌’ పేర్కొంది....

శాంసంగ్‌ బడ్స్‌తో  ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌

శాంసంగ్‌ బడ్స్‌ ఇక ఫిట్‌నెస్‌ ట్రాకింగ్‌కీ ఉపయోగపడనుంది. ఇదే విషయాన్ని ‘లెట్స్‌గోడిజిటల్‌’ పేర్కొంది. దీని నివేదిక ప్రకారం హార్ట్‌ రేట్‌, ఆక్సిజన్‌ లెవెల్స్‌కు ఉపయోగపడేలా బడ్స్‌ రూపకల్పనకు శాంసంగ్‌ ఇప్పటికే పేటెంట్‌ కూడా పొందినట్టు సమాచారం.  ‘శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ 2’  పేరిట వచ్చే ఏడాది ఆగస్టులో వీటిని మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన శాంసంగ్‌ గెలాక్సీ బడ్స్‌ ప్రొ ఫాలోఅ్‌పగా వీటిని చెబుతున్నారు. 2022 కన్జూమర్‌ ఎలకా్ట్రనిక్‌ షో(సిఈ   ్‌స)లో తరవాతి తరం(నెక్స్ట్‌ జనరేషన్‌) ఇయర్‌ బడ్స్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అయితే, కొత్త సెన్సర్లతో బరువు పెరిగి బడ్స్‌ భారంగా మారవచ్చని ‘లెట్స్‌గోడిజిటల్‌’ విశ్లేషించింది. మరోవైపు యాపిల్‌ కూడా ఎయిర్‌పాడ్స్‌కు హెల్త్‌ ఫీచర్స్‌ను జతచేసే యత్నాల్లో ఉంది. హియరింగ్‌ ఎయిడ్‌ గానూ ఎయిర్‌పాడ్‌ పనిచేస్తుందని ‘వాల్‌స్ట్రీట్‌’ జర్నల్‌’ ఇంతకుమునుపే పేర్కొంది. టెంపరేచర్‌ సెన్సర్స్‌ను అభివృద్ధిపరుస్తున్నట్టు కూడా పేర్కొంది. యాపిల్‌ వాచ్‌ 8 సిరీ్‌సలో ఇవి రానున్నట్టు కూడా

 సమాచారం. 

Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST