సంస్కారం–నమస్కారం

ABN , First Publish Date - 2021-07-16T08:11:28+05:30 IST

వెనకటి రోజుల్లో పెద్ద వాళ్లు వస్తుంటే రెండు అరచేతులు కలిపి ఆప్యాయంగా వారి పట్ల గౌరవం ప్రదర్శించేలా నమస్కరించే వాళ్లు...

సంస్కారం–నమస్కారం

వెనకటి రోజుల్లో పెద్ద వాళ్లు వస్తుంటే రెండు అరచేతులు కలిపి ఆప్యాయంగా వారి పట్ల గౌరవం ప్రదర్శించేలా నమస్కరించే వాళ్లు. కానీ ఇప్పుడు చేస్తున్న నమస్కారాలు చూస్తుంటే చాలా బాధ కలుగుతోంది. ఎవరైనా తెలిసినవారు, పెద్దవాళ్లు ఎదురుపడితే ఒక చేయి గాలిలో ఊపగానే, అవతలి వ్యక్తి కూడా అలాగే చేయి గాలిలో ఊపుతున్నారు. ఇది నమస్కారమా? ఒకరు ‘హాయ్‌’ అంటే ఎదుటి వ్యక్తి కూడా ‘హాయ్‌’ అంటున్నాడు. ఇది కూడా నమస్కారం చేసినట్టు అనుకోవాలా? ఎదురుగా వస్తున్న వ్యక్తి తన పెదిమలు అటూ ఇటూ కదిపి కన్పించని చిరునవ్వు ప్రదర్శిస్తే, ఇవతలి వ్యక్తి కూడా అదే విధంగా పెదిమలు కదిలించి చిరునవ్వు ప్రదర్శిస్తాడు. దీన్ని కూడా మనం నమస్కారం చేసినట్టు అనుకోవాలా? హతవిధీ! ఆప్యాయత, అభిమానం, ప్రేమానురాగాలు కురిపించే నమస్కారాలకు మసి ఏర్పడుతోంది.

వి.ఆర్‌. శేఖర్‌, చేబ్రోలు

Updated Date - 2021-07-16T08:11:28+05:30 IST