Abn logo
Apr 3 2020 @ 10:07AM

సినీ కార్మికుల కోసం రూ.5 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన సంప‌త్ నంది

క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌మంత‌టా లాక్ డౌన్‌. సినీ ప‌రిశ్ర‌మంతా స్తంభించిపోయింది. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొచ్చారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ‘క‌రోనా క్రైసిస్ చారిటీ’(సి.సి.సి) ను ఏర్పాటు చేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సంస్థ‌కు 6.2 కోట్ల రూపాయ‌లు విరాళంగా అందాయి. చిరంజీవి ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ సినీ క‌ళాకారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌ముఖులు ముందుకు రావాల‌ని సూచించారు. సి.సి.సి ద్వారా చిత్ర ప‌రిశ్ర‌మ కార్మికుల సంక్షేమార్థం ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. తాజాగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ‘సీసీసీ మ‌న‌కోసం’కు రూ.5లక్షల విరాళాన్ని ప్ర‌క‌టించారు. ప్రస్తుతం ఈయన గోపీచంద్‌తో ‘సీటీమార్’ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement