రెండు నెలల్లో రెండో ‘డబుల్‌’

ABN , First Publish Date - 2020-02-19T09:26:01+05:30 IST

సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన రాహుల్‌ ద్రావిడ్‌ బాటలో నడుస్తున్నాడు అతడి తనయుడు సమిత్‌ ద్రావిడ్‌. రెండు నెలల్లో రెండో డబుల్‌

రెండు నెలల్లో రెండో ‘డబుల్‌’

  • అదరగొట్టిన సమిత్‌ ద్రావిడ్‌

బెంగళూరు: సుదీర్ఘ ఇన్నింగ్స్‌తో టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన రాహుల్‌ ద్రావిడ్‌ బాటలో నడుస్తున్నాడు అతడి తనయుడు సమిత్‌ ద్రావిడ్‌. రెండు నెలల్లో రెండో డబుల్‌ సెంచరీ చేసి తండ్రికి తగ్గ తనయుడనని నిరూపించుకున్నాడు. బీటీఆర్‌ షీల్డ్‌ అండర్‌-14 మ్యాచ్‌లో మలయా అదితి స్కూల్‌ తరపున సమిత్‌ డబుల్‌ సెంచరీతో కదం తొక్కాడు. అతడు 146 బంతుల్లో 33 ఫోర్లతో 204 పరుగులు చేయడం విశేషం. సమిత్‌ అద్భుత బ్యాటింగ్‌తో మలయా స్కూల్‌ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 377 పరుగుల భారీస్కోరు చేసింది. బౌలింగ్‌లోనూ సత్తా చాటిన సమిత్‌ రెండు వికెట్లు (2/11) పడగొట్టాడు. ఇతర బౌలర్లు కూడా రాణించడంతో  శ్రీకుమరన్‌ చిల్డ్రన్స్‌ అకాడమీ జట్టు 32.1 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. దాంతో అదితి స్కూల్‌ జట్టు 267 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. నిరుడు అండర్‌-14 ఇంటర్‌ జోనల్‌ టోర్నీలోనూ సమిత్‌ డబుల్‌ సెంచరీ చేశాడు.

Updated Date - 2020-02-19T09:26:01+05:30 IST